సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

With Love: నెల తిర‌క్కుండానే.. మ‌రో సినిమాతో వ‌స్తున్న అన‌స్వ‌ర రాజ‌న్‌! టీజ‌ర్ అదిరింది

ABN, Publish Date - Jan 22 , 2026 | 04:54 PM

త‌మిళంలో అన‌స్వ‌ర న‌టించిన కొత్త సినిమా విత్ ల‌వ్‌ తెలుగులోనూ రిలీజ్‌కు రెడీ అయింది.

With Love

టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాతో ఒక్క‌సారిగా వెలుగులోకి వ‌చ్చి స్టార్ స్టేట‌స్ ద‌క్కిచుకున్న దర్శ‌కుడు అభిషన్ జీవింత్ (Abishan Jeevinth). ఇప్పుడు ఆయ‌న హీరోగా ఎంట్రీ ఇస్తూ విత్ ల‌వ్ (With Love) అనే చిత్రం తెర‌కెక్కిన విష‌యం తెలిసిందే. మ‌ల‌యాళ బ్యూటీ అన‌స్వ‌ర రాజ‌న్ (Anaswara Rajan) క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 6న ప్రేక్ష‌కుల ఎదుట‌కు వ‌చ్చేందుకు సిద్ధ‌మైంది.

త‌మిళంలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులోనూ థియేట‌ర్లకు తీసుకు వ‌స్తున్నారు. ఈ నేప‌థ్యంలో మేక‌ర్స్ తాజాగా బుధ‌వారం టైటిల్‌తో పాటు టీజ‌ర్ రిలీజ్ చేశారు. టీజ‌ర్ చూస్తే సింపుల్‌, ఫ‌న్ అండ్ యూత్ సినిమాగా తెర‌కెక్కించినట్లు అర్ధ‌మ‌వుతోంది. సౌంద‌ర్య ర‌జ‌నీకాంత్ (Soundarya Rajinikanth) ఈ చిత్రాన్ని నిర్మించ‌గా మ‌ద‌న్ (Madhan) ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

సూప‌ర్‌ యాక్టివ్‌ అయిన అమ్మాయి.. స‌త్తెకాల‌పు అబ్బాయి మ‌ధ్య ల‌వ్ ఎలా సాగింద‌నే క‌థ‌తో మంచి న‌వ్వులు పంచుతూ ఫీల్ గుడ్ మూవీలా టీజ‌ర్ సాగింది. త్వ‌ర‌లోనే ట్రైల‌ర్ కూడా రిలీజ్ చేయ‌నున్నారు. తెలుగులో సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్ (Suresh Productions) ఈ సినిమాను విడుదల చేస్తుండ‌డం విశేషం.

ఇప్ప‌టికే 20 రోజుల క్రిత‌మే ఛాంపియ‌న్ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన అన‌స్వ‌ర ఇప్పుడు నెల కూడా తిర‌క్కుండానే అనువాద చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల ఎదుట‌కు వ‌స్తుండ‌డంతో అమె ఫ్యాన్స్ ఫుల్‌ ఖుషి అవుతున్నారు.

Updated Date - Jan 22 , 2026 | 05:01 PM