P. C. Sreeram: బయోపిక్‌లన్నీ.. అసత్యాలే! అందుకే.. నా బయోపిక్‌కు అంగీకరించను
ABN, Publish Date - Jan 19 , 2026 | 10:06 AM
తనకు బయోపిక్‌లు అంటే ఏమాత్రం ఇష్టం లేదని, వాటిలో సగం అబద్దాలు ఉంటాయని దిగజ కెమెరామెన్ పీసీ శ్రీరామ్ అన్నారు.
తనకు బయోపిక్‌లు అంటే ఏమాత్రం ఇష్టం లేదని, వాటిలో సగం అబద్దాలు ఉంటాయని, అందువల్ల తన బయోపిక్ తీసేందుకు అంగీక రించనని దిగ్గజ కెమెరామెన్ పీసీ శ్రీరామ్ (P. C. Sreeram) అన్నారు. తమిళ్ మూవీ జర్నలిస్ట్ అసోసియేషన్ (టీఎంజేఏ) ఆధ్వర్యంలో తాజాగా స్థానిక వడపళనిలో సంక్రాంతి వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా పీసీ శ్రీరామ్ హాజరై ప్రసంగించారు.
'నా బయోపిక్ తీయాలన్న ఆలోచన ఏమాత్రం లేదు. కానీ, కొందరు అడుగుతున్నారు. మీ బయోపిక్ తీస్తామని. అందుకు నేను అంగీకరించను. అసలు బయోపిక్‌లంటే నాకు ఏమాత్రం ఇష్టం లేదు. నిజం చెప్పాలంటే బయోపిక్‌లో సగం అబద్ధాలు చెప్పాల్సి ఉంటుంది. ఆ పని నేను చేయలేను. నాకు దేవుడు అంటే ఇష్టం. లేదు. నా ఇష్టదైవాలు నా తల్లిదండ్రులే నేను ఉన్నత స్థాయికి చేరుకోవడానికి వారే మూల కారణం. అందుకే వారినే నేను దైవాలుగా కొలుస్తుంటాను.
నా వద్ద పని నేర్చుకున్న ప్రతి ఒక్క కెమెరామెన్ ఉన్నత స్థితికి చేరుకోవడం సంతోషంగా ఉంది. నా జీవితంలో అన్ని అపజయాలే చవిచూశాను. నా కెమెరా పనితనంలో ఎక్కువగా చీకటి సన్నివేశాలు ఉంటాయి. డార్క్ ఒక ప్రత్యేక ప్రపంచం. థియేటర్లో ప్రేక్షకులకు కొత్త అను భూతిని ఇస్తుంది. నాకు దర్శకత్వం వహించా లన్న ఆశ ఉంది. ఖచ్చితంగా త్వరలోనే దర్శకత్వం వహిస్తాను' అని పేర్కొన్నారు. కాగా, ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిథులుగా పీసీ శ్రీరామ్ శిష్యుడు, కెమెరామెన్ వైడ్ యాంగిల్ రవి, 'సిరై మూవీ నటుడు ఆక్షయ్ కుమార్ పాల్గొన్నారు.