Kollywood: విజయ్ 'గిల్లీ'ని దాటేసిన అజిత్ 'మంగాత్తా'!

ABN , Publish Date - Jan 24 , 2026 | 11:13 AM

విజయ్ 'గిల్లీ' రీ-రిలీజ్ రికార్డులను అజిత్ 'మంగాత్తా' సినిమా అధిగమించేసింది. దాంతో అజిత్ అభిమానులంతా రీ-రిలీజ్ విషయంలోనే తమ హీరోదే పైచేయి అని ఆనందపడుతున్నారు.

Vijay Vs Ajith

తమిళ సినిమా రంగంలో ఈ యేడాది పొంగల్ చాలా చిత్రంగా సాగింది. శివ కార్తికేయన్ (Shiva Karthikeyan) సినిమా 'పరాశక్తి' (Parashakthi) పరాజయం పాలు కాగా, విజయ్ (Vijay) నటించిన 'జన నాయగన్' (Jana Nayagan) సెన్సార్ ఇబ్బందుల కారణంగా విడుదలకే నోచుకోలేదు. ఇక విజయ్ అభిమానులను ఊరడిస్తూ 'తెరి' (Theri) ని జనవరి 23న తిరిగి విడుదల చేస్తామని నిర్మాత కలైపులి థాను ప్రకటించారు. దాన్ని తెలుగులోనూ 'పోలీస్' (Police) పేరుతో రీ-రిలీజ్ చేస్తామని అన్నారు. కానీ చివరి క్షణంలో 'తెరి', 'పోలీస్' రీ-రిలీజ్ ఆగిపోయింది. ఇదిలా ఉంటే... ఇప్పుడు తమిళనాడు సినీ అభిమానులను అజిత్ నటించిన 'మంగాత్తా' (Mankatha) సినిమా విశేషంగా ఆకట్టుకుంటోంది.


రీ-రిలీజ్ మూవీస్ రికార్డుల విషయంలో అజిత్ (Ajith) 'మంగాత్తా' ఇప్పుడు అగ్రస్థానంలో నిలిచింది. గతంలో విజయ్ నటించిన 'గిల్లి' సినిమా టాప్ పొజిషన్ లో ఉండగా, దాన్ని 'మంగాత్తా' మూవీ అధిగమించింది. ఈ సినిమా తొలిరోజున రూ. 3.75 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. గతంలో విజయ్ నటించిన 'గిల్లీ' సినిమా మొదటి రోజున రూ. 3.50 కోట్ల గ్రాస్ ను వసూలు చేసి ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. ఇప్పుడా రికార్డ్ ను 'మంగాత్తా' చెరిపేసింది. జాతీయ స్థాయిలో కూడా 'గిల్లీ' అప్పట్లో రూ. 4 కోట్ల గ్రాస్ వసూలు చేస్తే, 'మంగాత్తా' తాజాగా రూ. 4.1 కోట్లను వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే విజయ్ అభిమానులు మాత్రం ఈ ఫిగర్స్ ను పెద్దంత పట్టించుకోవడం లేదు. తమ హీరో సినిమా టిక్కెట్ ధర అప్పట్లో తక్కువ ఉండేదని, అలానే అత్యధిక మంది చూసిన సినిమాగా తమదే రికార్డ్ అని వాదిస్తున్నారు. 'గిల్లీ' రీ-రిలీజ్ టైమ్ లో ఏకంగా రూ. 20 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. మరి ఇప్పుడు 'మంగాత్తా' రీ-రిలీజ్ లో అంత గ్రాస్ ను వసులూ చేస్తుందా లేదా అనేది చూడాలి. అజిత్ కుమార్ 50వ చిత్రమైన 'మంగాత్తా'ను వెంకట్ ప్రభు డైరెక్ట్ చేశాడు. నెగెటివ్ షేడ్స్ ఉండే పోలీస్ ఆఫీసర్ గా అజిత్ నటించాడు. 2011లో వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ అప్పట్లో ఆడియెన్స్ కు సరికొత్త అనుభూతిని కలిగించింది. ఇందులో అర్జున్ సర్జా, త్రిషా, అంజలి, రాయ్ లక్ష్మీ, ఆండ్రియా, వైభవ్, అశ్విన్ కాకుమాను, ప్రేమ్ జీ అమరన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Also Read: Keeravani: కీరవాణి.. 'వందేమాతరం' రెడీ! 22 రోజులు.. వందలమంది గాయకులు

Also Read: Akira Nandan: కాపాడండి.. హై కోర్టుకు అకీరానందన్

Updated Date - Jan 24 , 2026 | 11:14 AM