Keeravani: కీరవాణి.. 'వందేమాతరం' రెడీ! 22 రోజులు.. వందలమంది గాయకులు

ABN , Publish Date - Jan 24 , 2026 | 09:06 AM

ఈ సారి జరగబోయే గణతంత్ర దినోత్సవ (Republic Day) వేడుకలకు ఆస్కార్ ఆకర్షణ తోడైంది.

Keeravani

ఈ సారి జరగబోయే గణతంత్ర దినోత్సవ (Republic Day) వేడుకలకు ఆస్కార్ ఆకర్షణ తోడైంది. దేశభక్తిని రగిలించే వందేమాతరం (Vande Mataram) గీతానికి ఈ ఏడాది ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం కీరవాణి (M. M. Keeravani) సరికొత్త బాణీలు సమకూర్చారు. 'వందేమాతరం' గీతాన్ని స్వరపరిచే అవకాశం రావడం చిన్న విషయం కాదు, ఇదొక పెద్ద బాధ్యత అని కీరవాణి అన్నారు. ఈ బాధ్యతను నా తండ్రి శ్రీ శివదత్త గారు నేర్పిన విద్య వల్లే సమర్థవంతంగా పూర్తి చేశాను. ఇది నాకు దక్కిన అరుదైన గౌరవమని కీరవాణి భావోద్వేగానికి లోనయ్యారు.

స‌మా నాన్న గారు, నా గురువుగారైన స్వర్గీయ శివదత్త గారు నాకు ఇచ్చిన కఠినమైన శిక్షణే నాకు ఈ ఐకానిక్ గీతాన్ని స్వర పరిచే ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది' అని కీరవాణి చెప్పారు. 'చెన్నై, ముంబై నగరాల నుంచి అనేకమంది సంగీతకారులను హైదరాబాద్‌కు రప్పించి ఈ గేయాన్ని రికార్డు చేశాం. దీన్ని పూర్తి చేయడానికి మాకు 22 రోజులు పట్టింది' అని ఆయన తెలిపారు.

శ్రేయా స్వరం

కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ ఈ సారి రిపబ్లిక్ డేలో ప్రదర్శించే శకటాన్ని సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన విషయం తెలిసిందే. అయితే వేడుకల్లో ఈ శకటం కదులుతుండగా దానికి అనుగుణంగా వినిపించే ఒక ప్రత్యేక గీతాన్ని శ్రేయా ఘోషల్ ఆలపించారు. భన్సాలీ ఆలోచనలకు ప్రాణం పోసేలా ఈ పాటను స్వరపరిచారు. ఈసారి వేడుకలు సంజయ్ లీలా భన్సాలీ సినిమాటిక్ విజన్‌కు శ్రేయా ఘోషల్ గాత్రమాధుర్యం తోడై ప్రేఓకుల‌ను అల‌రించ‌నున్నాయి.

Updated Date - Jan 24 , 2026 | 09:07 AM