సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఆధిక్‌ రవిచందర్‌ దర్శకత్వంలో ‘అజిత్‌-64’.. నిర్మాత ఎవరంటే.. 

ABN, Publish Date - Feb 14 , 2026 | 10:36 AM

‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ తర్వాత అజిత్‌ కుమార్‌(Ajith), ఆధిక్‌ రవిచంద్రన్‌ల (Adhik ravichandran) కాంబినేషన్‌లో మరో చిత్రం రూపొందనుంది.

‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ తర్వాత అజిత్‌ కుమార్‌(Ajith kumar), ఆధిక్‌ రవిచంద్రన్‌ల (Adhik ravichandran) కాంబినేషన్‌లో మరో చిత్రం రూపొందనుంది. ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశాన్ని ఏ నిర్మాతకు వరిస్తుందోనన్న చర్చ కోలీవుడ్‌లో సాగుతోంది.

ఈ విషయంపై దర్శకుడు ఆధిక్‌ మాట్లాడుతూ, ‘ఈ ప్రాజెక్టు పనులు ఈ నెల లేదా వచ్చే నెలలో ప్రారంభం కావచ్చు. కానీ, ప్రొడక్షన్‌ హౌస్‌, నిర్మాతపై సరైన క్లారిటీ లేదు. అదే సమయంలో టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ తెరకెక్కించనున్నట్టు ప్రాథమిక సమాచారం’ అని పేర్కొన్నారు. అయితే, కోలీవుడ్‌ వర్గాల సమాచారం మేరకు అజిత్‌ రెమ్యునరేషన్‌ విషయంలోనే   చర్చ కొనసాగుతోందని, దానిపై ఓ క్లారిటీ వస్తేగానీ నిర్మాత ఎవరు, ప్రాజెక్టు బడ్జెట్‌ ఎంత అనే విషయాలపై స్పష్టత వస్తుందని పేర్కొంటున్నాయి. 

ఇటీవల  అబుదాబిలో యాస్‌ మెరినా సర్క్యూట్‌లో జరిగిన రేస్‌లో అజిత్‌ టీమ్‌ పాల్గొంది. తమిళ హీరో శివ కార్తికేయన్‌ (Siva karthikeyan) అక్కడ అజిత్‌కుమార్‌ను కలిశారు. ఆయనతో దిగిన ఫొటోలను ఎక్స్‌ వేదికగా పోస్ట్‌  చేయగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. 

Updated Date - Feb 14 , 2026 | 10:50 AM