Ajith Kumar: అజిత్ కుమార్ కొత్త అవతారం.. ఎందుకంటే..
ABN , Publish Date - Jun 27 , 2026 | 09:36 AM
అగ్ర కథానాయకుడు, రేసర్ అజిత్ కుమార్ (Ajith Kumar) నిర్మాతగా అవతారమెత్తనున్నారు.
అగ్ర కథానాయకుడు, రేసర్ అజిత్ కుమార్ (Ajith Kumar) నిర్మాతగా అవతారమెత్తనున్నారు. ఆయన సొంతంగా ఓ చిత్రాన్ని నిర్మించే ప్రయత్నాల్లో ఉన్నట్టు కోలీవుడ్ వర్గాల సమాచారం. దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ వంటి హిట్ మూవీ తర్వాత అజిత్ కుమార్ మరో చిత్రానికి కమిట్ కాలేదు. ఈ చిత్రం విడుదలై కూడా యేడాదిన్నరకు పైగానే అయింది. అయితే, రోమియో పిక్చర్ నిర్మించే చిత్రంలో అజిత్ హీరోగా నటిస్తారని, ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తారంటూ జోరుగా ప్రచారం జరిగింది.
కానీ, ఈ ప్రాజెక్టు కోసం అజిత్ భారీ పారితోషికం డిమాండ్ చేయడంతో నిర్మాత వెనక్కి తగ్గినట్టు వినికిడి. ఈ నేపథ్యంలో తాను సొంతంగా ఒక చిత్రాన్ని నిర్మించాలని అజిత్ కుమార్ భావిస్తున్నారు. ఇప్పటికే తన కార్ రేసింగ్‌కు సంబంధించి ఏ.ఎల్.విజయ్ దర్శకత్వంలో డాక్యుమెంటరీ ఫిల్మ్ చిత్రీకరిస్తున్నారు. ఇది పూర్తి చేసిన తర్వాత సొంతంగా నిర్మించే చిత్రంపై అజిత్ దృష్టిసారించనున్నట్టు సమాచారం. అయితే, ఒక నిర్మాతగా అజిత్ ఈ రిస్క్ తీసుకుంటారా? అన్నది వేచి చూడాల్సిందే.
ఇవి కూడా చదవండి:
‘జననాయగన్’ నిర్మాతకు తమిళనాడు ప్రభుత్వం కీలక బాధ్యత!
సీఎంకి కాబోయే భార్యనా.. మజాకానా.. 3 కోట్ల నెక్లెస్ తో త్రిష రచ్చ
జక్కన్న షాక్ మాములుగా లేదుగా..! హీరోలు ఇక క్యూ కట్టవచ్చు