సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Ajith: అంతర్జాతీయ స్థాయిలో మరోసారి అజిత్‌ విజయం..

ABN, Publish Date - Apr 21 , 2026 | 02:36 PM

తమిళ స్టార్‌ అజిత్‌కు సినిమాలతోపాటు మోటర్‌ రేసింగ్‌పై ఉన్న ఇష్టం గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.

తమిళ స్టార్‌ అజిత్‌కు (Ajith) సినిమాలతోపాటు మోటర్‌ రేసింగ్‌పై ఉన్న ఇష్టం గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఆయన ఎన్నోసార్లు అంతర్జాతీయ స్థాయిలో భారత జెండాను ఎగరేశాడు. తాజాగా బెల్జియంలోని ప్రఖ్యాత సర్క్యూట్‌ డి స్పా-ఫ్రాంకోర్‌ చాంప్స్‌ ట్రాక్‌పై జరిగీన 24ఏ సిరీస్‌ రేసులో ఆయన టీమ్‌ అద్భుతమైన ప్రదర్శనతో రెండో స్థానంలో నిలిచింది. ఈ విజయంతో అజిత్‌ రేసింగ్‌ టీమ్‌ ప్రపంచవ్యాప్తంగా మరోసారి చర్చనీయాంశంగా మారింది.

తాజాగా బెల్జియంలో జరిగిన ఈ ఎండ్యూరెన్స్‌ రేస్‌ ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పోటీలలో ఒకటి. 24 గంటలపాటు నిరంతరంగా జరిగే ఈ రేసులో టీమ్‌ వర్క్‌, ఫోకస్‌, స్టామినా ఎంతో ముఖ్యం. అలాంటి పోటీలో అజిత్‌ కుమార్‌ టీమ్‌ రెండో స్థానం పొందటం గొప్ప విజయంగా భావించవచ్చు. రేస్‌ అనంతరం పోడియంపై అజిత్‌ భారత జెండాను ఎగురవేస్తూ సంబరాలు జరుపుకొన్నారు. ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ట్రోఫీతో పాటు జెండాను పట్టుకుని టీమ్‌తో కలిసి సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఈ విజయం కేవలం వ్యక్తిగత గెలుపు కాదని దేశం సాధించిన గెలుపు అని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.

Updated Date - Apr 21 , 2026 | 02:43 PM