Ajith Kumar: నాలాగే.. అభిమానులు ఉన్నతస్థాయికి చేరుకోవాలి
ABN, Publish Date - Jan 14 , 2026 | 09:17 AM
అభిమానులు కూడా తనలాగే ఉన్నతస్థాయికి చేరుకోవాలని అగ్ర హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) అకాంక్షించారు.
అభిమానులు కూడా తనలాగే ఉన్నతస్థాయికి చేరుకోవాలని అగ్ర హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) అకాంక్షించారు. ప్రస్తుతం హీరోగా కంటే రేసర్‌గా ఎంతో బిజీగా ఉన్న ఆయన. వివిధ దేశాల్లో జరుగుతున్న కార్ రేసింగ్ పోటీల్లో పాల్గొంటున్నారు. గత యేడాది అబుదాబి, మలేసియా, బార్సిలోనా వంటి దేశాల్లో జరిగిన కార్ రేసింగ్ పోటీల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం 24 హెచ్ సిరీస్ సెంట్రల్ ఈస్ట్ ట్రాఫిక్ పేరుతో జరిగే రేసింగ్ పోటీల్లో పాల్గొంటున్నారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘జీవితంలో నేను ఉన్నత స్థితిలో ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. అలాగే, వారు కూడా ఉన్నస్థాయికి చేరుకుని వారి వారి కుటుంబాలతో సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నాను’ అని పేర్కొన్నారు.నేను ఎంతో ఒడిదుడుకులు ఎదుర్కొంటే ఇప్పుడు ఈ స్థాయికి వచ్చానని, నా ఫ్యాన్స్‌కు కూడా కష్టం చేసి పైకి ఎదగాలని సూచించారు. కాగా, అజిత్ కుమార్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ తర్వాత మరో చిత్రానికి కమిట్ కాలేదు. ఈ నేపథ్యంలో తన తదుపరి చిత్రంపై పొంగల్‌కు ప్రకటన వెలువడవచ్చని ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.