Prabhu Deva: తెలుగులో.. ఓ సినిమా చేస్తున్నా
ABN, Publish Date - Jan 16 , 2026 | 12:03 PM
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రభుదేవా ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు.
ప్రస్తుతం తాను నటిస్తున్న ‘మూన్‌వాక్’ ( Moonwalk) అనే సినిమా నెలలో విడుదల కానుందని ప్రముఖ కొరియోగ్రాఫర్, హీరో ప్రభుదేవా (Prabhu Deva) వెల్లడించారు. తిరుమల శ్రీవారిని బుధవారం ఉదయం దర్శించుకున్న ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు.
చాలా రోజుల తర్వాత శ్రీవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. తెలుగులోనూ ఓ చిత్రం చేయనున్నట్టు చెప్పారు. కాగా, ఆలయం ముందు ప్రభుదేవాను చూసేందుకు సినీ అభిమానులు ఉత్సాహం చూపారు. ఆయనతో కలిసి సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు.