విప్లవ నేతగా.. అధర్వ మురళి
ABN, Publish Date - Jul 24 , 2026 | 09:20 AM
అధర్వ మురళి నటించిన 'అడ్రస్' సినిమా సెప్టెంబరులో విడుదలకు సిద్ధమైంది.
'ఇదయం మురళి' వంటి ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న హీరో అధర్వ మురళి (Atharvaa Murali) నటించిన మరో చిత్రం అడ్రస్ (Address) సెప్టెంబరులో విడుదలకు సిద్ధ మైంది. ఇందులో కాళి అనే విప్లవ నేత పాత్రలో అధర్వ నటించారు. 'వానవరాయన్ వల్లవరాయన్' ఫేం రాజమోహన్ దర్శ కత్వం వహించారు.
1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా విభజన చేసిన సమయంలో తమిళనాడు, కేరళ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలోని ఒక గ్రామం ఏ ఒక్క రాష్ట్రంలో చేర్చకపోవడంతో ప్రజల తమ గుర్తింపు, హక్కుల కోసం సాగించిన యధార్థ పోరాటం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు.
ఈ మూవీలో పూజా జవేరి హీరోయిన్‌గా నటించగా, శక్తి భరత్, తంబి రామయ్య తదితరలు ఇతర పాత్రలను పోషించారు. కొన్ని నెలల క్రితమే చిత్రీకరణ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నప్పటికీ విడుదల తేదీపై ఎలాంటి ప్రకటన లేదు. ఈ నేపథ్యంలో సెప్టెంబరులో చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించారు.