Jayalalithaa IT Case: దివంగత సీఎం జయలలిత ఐటీ కేసు.. మద్రాసు హైకోర్టు హైకోర్టు సంచలన నిర్ణయం!
ABN, Publish Date - Nov 15 , 2026 | 07:27 AM
దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సంబంధించిన ఆదాయపు పన్ను కేసులో మద్రాసు హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.
ఐటీ కేసు ( IT Case) నుంచి దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత (Jayalalithaa) పేరు తొలగిస్తూ ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ జారీ చేసిన ఉత్తర్వులు సమర్థనీయమేనని మద్రాసు హైకోర్టు (Madras High Court) స్పష్టం చేసింది జయ కొన్నేళ్లుగా ఐటీ లెక్కలు సమర్పించలేదంటూ ఆదాయపు పన్నుల శాఖ (Income Tax Department) అధికారులు గతంలో కేసు వేశారు.
ఈ కేసు నుంచి తనను విడిపించాలని కోరుతూ జయ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన ఆదాయపు పన్నుల అప్పీలేట్ ట్రిబ్యునల్ ఆమెను ఆ కేసు నుంచి విడిపిస్తూ ఉత్తర్వులి చ్చింది. ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆదాయపు పన్ను శాఖ 2008లో, 2009లో మద్రాసు హైకోర్టులో మూడు రకాల పిటిషన్లను దాఖలు చేసింది. ఈ పిటిషన్లపై కొన్నేళ్లుగా విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో జయ మృతి తర్వాత ఆమె చట్టబద్ధమైన వారసులైన దీపా(Deepa), దీపక్ (Deepak)ను కేసులో చేర్చారు.
ఈ పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్ అనితా సుమంత్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణ జరగ్గా- దీపక్ తరపు న్యాయవాది సుదర్శనం వాదనలు వినిపిస్తూ ఆదాయపు పన్నుల అప్పీలేట్ ట్రిబ్యునల్ తగిన దస్తావేజులను క్షుణ్ణంగా పరిశీలించిన మీదటే తీర్పు వెలువరించిందని, అందువల్ల ఆదాయపు పన్నుల శాఖ దాఖలు చేసిన అప్పీలును తోసిపుచ్చాలని అభ్యర్థించారు. ఈ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం ఆదాయపు పన్నుల శాఖ దాఖలు చేసిన మూడు అప్పీళ్లను కొట్టివేసింది. ఆదాయపు పన్నుల అప్పీలేట్ ట్రిబ్యునల్ జారీ చేసిన ఉత్తర్వులు సమర్ధనీయమేనని స్పష్టం చేసింది.