సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

సొంత భాష‌లో.. డ‌బ్బింగ్ చెప్పిన త్రిష‌

ABN, Publish Date - Apr 17 , 2026 | 09:36 AM

హీరోయిన్ త్రిష (Trisha Krishnan) చాలాకాలం తర్వాత సొంతంగా డబ్బింగ్ చెప్పారు.

Trisha

హీరోయిన్ త్రిష (Trisha Krishnan) చాలాకాలం తర్వాత సొంతంగా డబ్బింగ్ చెప్పారు. సూర్య (Suriya) హీరోగా ఆర్జే బాలాజీ (RJ Balaji) దర్శకత్వంలో రూపొందుతున్న కరుప్పు (Karuppu) మూవీలో తన పాత్రకు ఈ చెన్నై చంద్రం డబ్బింగ్ చెప్పుకున్నారు. సాధారణంగా త్రిషది మాతృభాష త‌మిళమైనప్ప‌టికీ త‌ను నటించే చిత్రాల్లో తెలుగు, త‌మిళం, క‌న్న‌డ చిత్రాల్లో అధిక భాగం డబ్బింగ్ ఆర్టిస్టులే డబ్బింగ్ చెబుతుంటారు.

అయితే, గతంలో త్రిష 'ఆయుధ ఎళుత్తు', 'మంగాత్త', 'సమర్', 'మన్మథన్ అంబు', 'లియో' వంటి చిత్రాలకు స్వ‌యంగా డబ్బింగ్ చెప్పారు. ఇపుడు మ‌ర‌లా సుధీర్ఘకాలం తర్వాత 'కరుప్పు' మూవీకి మాత్రం ఆమె స్వత‌హాగా డబ్బింగ్ చెప్పడం విశేషం.

ఇదిలావుంటే, చిత్రీకరణ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న 'కరుప్పుస‌ మూవీలో సూర్య సూపర్ హీరోగా నటించినట్టు దర్శకుడు ఆర్జే బాలాజీ సూచన ప్రాయంగా వెల్లడించారు. ఈ విషయంపై దర్శకుడుమాట్లా డుతూ, 'కరుప్పు స్వామి చాలా మందికి కుల దైవం.

మతాలకు అతీతంగా ఆయన అయ్య నార్, ముని, కరుప్పుస్వామి అంటూ గ్రామాల పొలిమేరల్లో వెలసివుంటారు. గ్రామంలోకి వచ్చి వెళ్ళే ప్రజలు కరుప్పు.. మా వెంట రావయ్యా' అంటూ కోరుతూ ప్రార్థిస్తుంటారు. అయితే, విపత్కర పరిస్థితులు ఎదురైనపుడు ప్రజలను కాపాడేందుకు సూపర్ హీరో వస్తే ఎలా ఉంటుందన్నదే ఈ చిత్ర కథ. దీన్ని ఎంతో ఎంటర్టైనర్, యాక్షన్ భరితంగా తెరకెక్కించానని పేర్కొన్నారు.

Updated Date - Apr 17 , 2026 | 11:31 AM