Jailer 2: 40 ఏళ్ల తర్వాత.. ఫ్యాన్స్‌తో కలిసి సినిమా చూసిన రజనీ
ABN, Publish Date - Oct 25 , 2026 | 07:31 AM
సూపర్ స్టార్ రజనీకాంత్ తన సినీ కెరీర్‌లో నాలుగు దశాబ్దాల తర్వాత తాను నటించిన జైలర్ 2 చిత్రాన్ని అభిమానులు, ప్రేక్షకులతో కలిసి చూశారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ ( Rajinikanth) తన సినీ కెరీర్‌లో నాలుగు దశాబ్దాల తర్వాత తాను నటించిన జైలర్-2 (Jailer 2) చిత్రాన్ని అభిమా నులు, ప్రేక్షకులతో కలిసి చూశారు. ఈ విషయాన్ని ఆ చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ తన ట్విటర్ హ్యాండిల్‌లో అధికారికంగా వెల్లడించింది. ఈ నెల 15న విడుదలైన ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణతో ఇప్పటికే రూ.600 కోట్లకు పైగా వసూ ళ్లను సాధించిన విషయం తెలిసిందే. సినిమా విడుదలై పది రోజులు గడిచిపోయినప్పటికీ అన్ని థియేటర్లలో హౌసుఫుల్ కలెక్షన్లతో ప్రదర్శితమవుతోంది.
ఈ నేపథ్యంలో రజనీకాంత్ తన అభిమానులు, సినీ ప్రేక్షకులతో కలిసి వేళచ్చేరిలోని ఫీనిక్స్ మాల్‌లో ఐమ్యాక్స్ స్క్రీన్‌లో సినిమాను చూసి ఎంజాయ్ చేశారు. ఈ సినిమాను చూసేందుకు రజనీకాంత్ వచ్చిన వీడియోను సన్ పిక్చర్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. రజనీకాంత్, ధనుష్ ఐశ్వర్య కుమారులైన యాత్ర, లింగాతో పాటు చిత్ర దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar), సంగీత దర్శకుడు అనిరుధ్, పలువురు చిత్రబృందం సభ్యులున్నారు.