సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

జూమ్‌ చేసి.. మా శరీరాలను ఫొటోలు తీస్తారా?

ABN, Publish Date - Mar 04 , 2026 | 07:11 AM

నటీమణులను సినిమా, పబ్లిక్‌ ఈవెంట్స్‌లో అసభ్యకరమైన రీతిలో ఫొటోలు తీయడాన్ని కన్నడ హీరోయిన్‌ సప్తమి గౌడ (Sapthami Gowda) తప్పుబట్టారు.

Sapthami Gowda, Rukmini Vasanth, Ashika Ranganath

నటీమణులను సినిమా, పబ్లిక్‌ ఈవెంట్స్‌లో అసభ్యకరమైన రీతిలో ఫొటోలు తీయడాన్ని కన్నడ హీరోయిన్‌ సప్తమి గౌడ (Sapthami Gowda) తప్పుబట్టారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు. ఆమె పెట్టిన పోస్ట్‌కు హీరోయిన్లు ఆషిక రంగనాథ్ (Ashika Ranganath), రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) కూడా మద్దతుగా నిలవడంతో ఈ విషయం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

‘పరిశ్రమలోని మహిళలంతా కలసికట్టుగా ఓ కొత్త సమస్యపై గొంతు విప్పాల్సిన సమయం వచ్చింది. సినిమా లేదా పబ్లిక్‌ కార్యక్రమాల్లో పాల్గొంటున్న నటీమణులపై అభ్యంతకర రీతిలో జూమ్‌ చేసి ఫొటోలు, వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు.

ఇలా చేయడం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. వీటిని భరించాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో హద్దుల ఏర్పాటు కోసం నటీమణులంతా ఒక్కటిగా నిలబడాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్న మహిళందరికీ సపోర్ట్‌గా నిలబడదాం’ అని పేర్కొన్నారు.

Updated Date - Mar 04 , 2026 | 10:24 AM