సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Trisha: అమాంతం.. పారితోషికం పెంచేసిన త్రిష

ABN, Publish Date - Jun 14 , 2026 | 05:27 PM

వరుస విజయాలతో జోరు మీదున్న హీరోయిన్ త్రిష తన పారితోషికాన్ని భారీగా పెంచినట్టు కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది.

Trisha

అభిమానులలు ‘చెన్నై చంద్రం’గా ముద్దుగా పిలిచే హీరోయిన్‌ త్రిష (Trisha) ఇపుడు తన పారితోషికాన్ని ఆమాంతం పెంచినట్టు కోలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఆమె నటించిన చిత్రాలన్నీ వరుసగా విజయం సాధిస్తున్నాయి.

తాజాగా త్రిష... హీరో సూర్య (Suriya) సరసన నటించిన ‘కరుప్పు’ (Karuppu) చిత్రం బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందనున్న ఓ కొత్త చిత్రంలో హీరోయిన్‌గా త్రిషను సంప్రదించగా రూ.10 కోట్ల నుంచి రూ.12 కోట్ల పారితోషికం ఇవ్వాలని అడిగినట్టు కోలీవుడ్‌లో ప్రచారం సాగుతోంది.

ప్రస్తుతం త్రిష మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న ‘విశ్వంభర’ (Vishwambhara) లో నటించారు. ఈ సినిమా కోసం ఆమె రూ.6 కోట్లు మాత్రమే తీసుకోగా, ఇపుడు రెట్టింపు రెమ్యునరేషన్‌ డిమాండ్‌ చేయడంతో మేకర్స్‌ షాక్‌కు గురైనట్టు సమాచారం. అయితే, ఆ చిత్రంలోని పాత్రకు త్రిషను ఎంపిక చేయాలన్న పట్టుదలతో ఉన్న మేకర్స్‌... పారితోషికంపై సంప్రదిస్తున్నట్టు వినికిడి.

Updated Date - Jun 14 , 2026 | 05:39 PM