Anandhi Ajay: ఒక్క సీన్ కూడా లేదు.. కన్నీళ్లు పెట్టుకున్న నటి..
ABN, Publish Date - Jul 24 , 2026 | 04:20 PM
ఆనంది అజయ్ తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'జన నాయగన్' చిత్రంలో ఓ పాత్ర పోషించారు. అయితే తన సన్నివేశాలన్నీ తొలగించడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు
క్లాసికల్ డ్యాన్సర్‌గా, యోగా ట్రైనర్‌గా సుపరిచితమైన ఆనంది అజయ్ తమిళంలో పలు సీరియల్స్‌లో మెప్పించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'జన నాయగన్' చిత్రంలో ఓ పాత్ర పోషించారు. అయితే తన సన్నివేశాలన్నీ తొలగించడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు కన్నీటి పర్యంతమవుతూ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేశారు.
ఈ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. 'జన నాయగన్' కోసం తాను దాదాపు ఏడాది పాటు కష్టపడ్డాను. విజయ్ చివరి చిత్రంలో నటించే అవకాశం రావడం జీవితంలో మరచిపోలేని అనుభవమని భావించాను. కానీ చివరకు సినిమాలో తన ఒక్క సన్నివేశం కూడా లేకపోవడం తీవ్రంగా బాధించింది. ఎంతో ఆశతో కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి థియేటర్‌కు వెళ్లినా.. తెరపై ఒక్క సీన్లో కూడా కనిపించకపోయేసరికి షాక్‌కు గురయ్యాను' అని భావోద్వేగానికి లోనయ్యారు. ఆనంది వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనితో నెటిజన్లు స్పందిస్తున్నారు. సినిమా పరిశ్రమలో ఇలాంటి పరిస్థితులు కొత్తవి కావని, నటీనటుల కష్టానికి గుర్తింపు దక్కాలని పలువురు నెటిజన్లు ఆమెకు మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు. అయితే, సెన్సార్ బోర్డు సూచించిన 12 కీలక మార్పుల్లో భాగంగానే కొన్ని సన్నివేశాలను తొలగించినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అలా ఆనంది పాత్ర కూడా ఎడిటింగ్‌లో తొలగిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. జూలై 23న విడుదలైన 'జన నాయకుడు' చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. తొలి రోజూ ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.78 కోట్ల గ్రాస్, దేశవ్యాప్తంగా రూ.41 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.