శివ కార్తికేయన్.. సరసన భాగ్యశ్రీ బోర్సే
ABN, Publish Date - Feb 16 , 2026 | 10:45 AM
తమిళ హీరో శివకార్తికేయన్ సరసన టాలీవుడ్ నటి భాగ్యశ్రీ బోర్సే నటించనున్నారు.
తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ (Sivakarthikeyan) సరసన టాలీవుడ్ నటి భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) నటించనున్నారు. ఇందుకోసం ఆమెతో ఎస్కే సంప్రదిస్తున్నారు. 'తాయి కిళవి' దర్శ కుడు శివకుమార్ మురుగేశన్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రానికి సంబంధించిన ప్రోమోషన్స్ తాజాగా మధురైలో పూర్తి చేశారు. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన మరిన్ని వివరాలను ఈ నెల 17న శివకార్తికేయన్ పుట్టిన రోజున అధికారికంగా ప్రకటించనున్నారు.
ఒకవేళ శివకార్తికేయన్ సరసన నటించేందుకు భాగ్యశ్రీ బోర్సే సమ్మతిస్తే ఆమెకు ఇది ఆమెకు రెండో తమిళ చిత్రం అవుతుంది. దీనికి ముందు ఆమె నటించిన 'కాంత' చిత్రం పరాజయం పాలైనా, నటిగా భాగ్యశ్రీ అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం తెల్సిందే. మరోవైపు, పూర్తి గ్రామీణ నేపథ్యంలో రూపొందించే ఈ చిత్రాన్ని సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు.