సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Prakash Raj: వారంతా అమ్ముడు పోయారు.. లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు

ABN, Publish Date - Jun 24 , 2026 | 04:08 PM

నాలుగు రాష్ట్రాల్లో ఓటరు గుర్తింపు కార్డులు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో తనపై వచ్చిన వార్తలపై నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు.

Prakash Raj

నాలుగు రాష్ట్రాల్లో ఓటు గుర్తింపు కార్డు ఉంద‌నే అరోప‌ణ‌ల నేప‌థ్యంలో బెంగ‌ళూరు 48 ఏసీ జేఎం కోర్టు ఇటీవ‌ల‌ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ (Prakash Raj) కు నాన్‌ బెయిల‌బుల్ వారెంట్ జారీ చేసిన విష‌యం తెలిసిందే..ఈ క్ర‌మంలో తాజాగా ఈ వార్త‌ల‌పై ఆయన 'ఎక్స్'లో స్పందించారు.

వారంతా అమ్ముడు పోయారు.. అందుకే తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ నటుడు ప్రకాశ్ రాజ్ మండిపడ్డారు. తప్పుడు సమాచారాన్ని సృష్టించడంలో వారికి ఎవరూ సాటి రారని ఎద్దేవా చేశారు. నేను చాలా సంతో షంగా ఉన్నాను, ఎందుకంటే వారు బిజీగా ఉన్నందుకే అంటూ.. నాపై వ‌చ్చిన‌దంతా తప్పుడు సమాచారం అని కొట్టిపారేశారు.

Updated Date - Jun 24 , 2026 | 04:31 PM