సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ప్రకాశ్ రాజ్‌కు మాతృ వియోగం

ABN, Publish Date - Mar 30 , 2026 | 10:36 AM

విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ ఇంట తీవ్ర విషాదం నెల‌కొంది. ఆయ‌న మాతృమూర్తి సువర్ణలత (86) ఈ రోజు (సోమ‌వారం) ఉదయం త‌న స్వగృహంలో కన్నుమూశారు.

prakash raj

విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ (Prakash Raj) ఇంట తీవ్ర విషాదం నెల‌కొంది. ఆయ‌న మాతృమూర్తి సువర్ణలత (Suvarna Latha) (86) ఈ రోజు (సోమ‌వారం) ఉదయం త‌న స్వగృహంలో కన్నుమూశారు. ఈ రోజు సాయంత్రం బెంగళూర్ లో అంత్య క్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.

విష‌యం తెలుసుకున్న ప‌లువురు తెలుగు, త‌మిళ సెల‌బ్రిటీలు ఆయ‌న‌కు సంతాపం తెలియ‌జేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ ప్రగాఢ సానుభూతి

ప్రకాష్ రాజ్ తల్లి మృతిపై పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆయన సంతాప సందేశాన్ని మీడియాకు విడుదల చేశారు.

ప్రముఖ నటుడు శ్రీ ప్రకాష్ రాజ్ గారి మాతృమూర్తి శ్రీమతి సువర్ణలత గారు కన్నుమూశారని తెలిసి చింతించాను. శ్రీమతి సువర్ణలత గారు ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. మాతృ వియోగానికి లోనైన శ్రీ ప్రకాష్ రాజ్ గారికి, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.

(పవన్ కళ్యాణ్)

ఉప ముఖ్యమంత్రి

అని ఆ సందేశంలో పేర్కొన్నారు.

Updated Date - Mar 30 , 2026 | 12:07 PM