సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఒక్క నిమిషం ప్ర‌క‌ట‌న‌కు.. రూ.40 కోట్లా

ABN, Publish Date - Oct 01 , 2026 | 12:27 PM

సినిమా ప్రమోషన్లు, యాడ్స్‌కు ఎప్పుడూ దూరంగా ఉండే కోలీవుడ్ స్టార్ అజిత్ తాజాగా చేసిన ఒక నిమిషం యాడ్ తీవ్ర చర్చనీయాంశమైంది.

Ajith Kumar

సినిమా ప్రమోషన్లు, యాడ్స్‌కు ఎప్పుడూ దూరంగా ఉండే కోలీవుడ్ స్టార్ అజిత్ (Ajith Kumar).. తాజాగా 'నోవా' రియల్ ఎస్టేట్ (Nova Life Space (Nova Real Estate) సంస్థ కోసం చేసిన ఒక నిమిషం యాడ్ తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఒక్క వాణిజ్య ప్రకటన కోసమే ఆయన ఏకంగా రూ.40 కోట్ల భారీ పారితోషికం అందుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.

ప్రముఖ దర్శకుడు ఏఎల్ విజయ్ (A.L. Vijay) తెరకెక్కించిన ఈ యాడ్ రెమ్యూనరేషన్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నా, అజిత్ క్రేజ్ ముందు ఆ మొత్తం తక్కువేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

కాగా ఈ యాడ్ డైరెక్ట్ చేసినందుకుగాను విజ‌య్‌కు రూ. 3కోట్లు రెమ్యున‌రేష‌న్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. మరోవైపు గ‌తేడాది 'గుడ్ బ్యాడ్ అగ్లీ' హిట్ తర్వాత ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న 'రెడ్ డెవిల్' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Updated Date - Oct 01 , 2026 | 12:34 PM