సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా 175వ చిత్రం షురూ

ABN, Publish Date - Nov 28 , 2026 | 02:26 PM

పహల్గామ్ దాడి, ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో అర్జున్ సర్జా 175వ సినిమా ప్రారంభమైంది. అయోధ్యలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తొమ్మిది భాషల్లో విడుదల చేయనున్నారు.

యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా 175వ (Arjun sarja -175) చిత్రం  షురూ అయింది. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఆయన ఓ భారీ బహుభాషా చిత్రాన్ని రూపొందించనున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌కు అయోధ్యలో పూజా కార్యక్రమాలతో శ్రీకారం చుట్టారు. అనూప్ మోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 'ప్రెసిడెన్షియల్ మూవీస్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్' పతాకంపై తెరకెక్కించనున్నారు. అయోధ్యలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు, విశిష్ట అతిథులు హాజరయ్యారు. అర్జున్ సర్జా తన భార్య నివేదితతో కలిసి ఈ వేడుకలో పాల్గొన్నారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రంలో ప్రారంభ పూజలు నిర్వహించిన తొలి చిత్రంగా ఇది నిలుస్తుందని చిత్ర బృందం పేర్కొంది.  

సైనికాధికారి స్క్రీన్‌ప్లేతో.. తొమ్మిది భాషల్లో..

ఈ సినిమా కోసం అర్జున్ సర్జా దర్శకుడిగా, నటుడిగా రెండు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. విశ్రాంత భారత సైనికాధికారి మేజర్ విజయ్ భార్గవ్ అందించిన స్క్రీన్‌ప్లే ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. కర్తవ్యం, త్యాగం, ధైర్యం, జాతీయ భద్రత వంటి అంశాల చుట్టూ ఈ కథ సాగనుంది. దేశం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు సైనికులు ప్రదర్శించే సంకల్పం, వారి వెనుక ఉన్న మానవీయ భావోద్వేగాలను తెరపై ఆవిష్కరించనున్నారు. అయితే ఈ సినిమా టైటిల్‌ను రహస్యంగా ఉంచారు. తొలుత ప్రధానంగా హిందీలో రూపొందించి, మొత్తం తొమ్మిది భాషల్లో విడుదల చేయాలని చిత్ర బృందం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. డిసెంబర్ నుంచి చిత్రీకరణ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. భారతదేశ 81వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 2027 ఆగస్టు 15న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

Updated Date - Nov 28 , 2026 | 02:28 PM