Thalapathy Vijay: ఏం మాట్లాడుతున్నార్రా.. 220 కోట్లు రెమ్యూనరేషన్ ఏంట్రా
ABN, Publish Date - Jan 09 , 2026 | 07:41 PM
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ (Thalapathy Vijay) చివరి సినిమాకు సెన్సార్ కష్టాలు ఇప్పుడప్పుడే తొలగేలా కనిపించడం లేదు.
Thalapathy Vijay: కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ (Thalapathy Vijay) చివరి సినిమాకు సెన్సార్ కష్టాలు ఇప్పుడప్పుడే తొలగేలా కనిపించడం లేదు. అన్ని బావుండి ఉంటే జనవరి 9 న జన నాయగన్ (Jana Nayagan) థియేటర్ లో సందడి చేస్తూ ఉండేది. కానీ, సెన్సార్ సర్టిఫికెట్ రానందువలన రిలీజ్ వాయిదా పడింది. కనీసం కోర్టు రిలీజ్ రోజైనా సెన్సార్ సర్టిఫికెట్ ని ఇస్తుందేమో అనుకున్నారు. కానీ, సెన్సార్ సర్టిఫికెట్ జారీపై స్టే ఇచ్చింది. ఈ కేసు విచారణ జనవరి 21 కి వాయిదా పడింది. దీంతో అప్పటివరకు జన నాయకుడు వచ్చేది లేదు.
రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్.. తన అభిమానుల కోసం చివరగా నటించిన చిత్రం జన నాయగన్. హెచ్ వినోత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజా హెగ్డే, మమితా బైజు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. తెలుగులో సూపర్ హిట్ అయిన భగవంత్ కేసరి సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కినట్లు ట్రైలర్ ని బట్టి అర్ధమవుతుంది. కాకపోతే ఈ రీమేక్ ని తమకు తగ్గ రీతిలో మార్చుకున్నారు. బాలకృష్ణ అంత కాకపోయినా.. విజయ్ తనదైన స్టైల్లో మెప్పించాడు అని చెప్పొచ్చు.
ఇక ఇదంతా పక్కన పెడితే.. జన నాయగన్ కి విజయ్ తీసుకున్న రెమ్యూనరేషన్ గురించి కోలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఇప్పటివరకు ప్రభాస్.. 150 కోట్లు తీసుకుంటున్నాడు.. హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరో అని చెప్పుకొచ్చారు. కానీ, ఇండియాలోనే హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరో విజయ్ అని టాక్ నడుస్తోంది.
జన నాయగన్ కోసం విజయ్ అక్షరాలా రూ. 220 కోట్లు పారితోషికం అందుకున్నాడట. ఈ సినిమా బడ్జెట్ రూ. 380 కోట్లు అయితే.. అందులో సగంకు పైగా బడ్జెట్ కేవలం విజయ్ రెమ్యూనరేషన్ కే పోయిందని అంటున్నారు. ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ.. ఇది విజయ్ కి కొత్తేమి కాదని, గోట్ సినిమాకు రూ. 200 కోట్లు పారితోషికం అందుకున్నట్లుచెప్పుకొస్తున్నారు. ఇక ఈ వార్త విన్న నెటిజన్స్ ఏం మాట్లాడుతున్నార్రా.. 220 కోట్లు రెమ్యూనరేషన్ ఏంట్రా అంటూ షాక్ అవుతున్నారు. విజయ్ ఫ్యాన్స్ మాత్రం అది దళపతి రేంజ్ అని కామెంట్స్ పెడుతున్నారు.