భర్త దీర్ఘాయుష్షు కోసం రోజంతా ఉపవాసముండి నిండు మనసుతో జరుపుకునే పవిత్రమైన కర్వా చౌత్ పర్వదినాన్ని సెలబ్రిటీలు ఎంతో వైభవంగా జరుపుకున్నారు. కర్వాచౌత్ పూజలో శిల్పా శెట్టి, సోనమ్ కపూర్ వంటి తారలు పట్టుచీరల్లో మెరిసిపోతూ వేడుకలకు ప్రత్యేక కళ తీసుకొచ్చారు. ఈ వేడుకను పురస్కరించుకుని స్టార్ కపుల్స్ అందమైన చిత్రాలతో సోషల్ మీడియాలో అందంగా వెలిగిపోతోంది.