సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

నిశ్చితార్థపు వేడుకలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డి.. ఫొటోలు వైరల్

ABN,Publish Date - Apr 07 , 2026 | 08:42 PM

1/9

నిర్మాత బెల్లంకొండ సురేష్ పెద్ద కుమారుడు, హీరో సాయి శ్రీనివాస్ అందరికీ పరిచయమే. ఈ హీరో ఇప్పుడు ఓ ఇంటివాడు కాబోతున్న విషయం తెలిసిందే.

2/9

టాలీవుడ్‌ బ్యాచ్‌లర్ హీరోలలో ఒకరిగా ఉన్న శ్రీనివాస్ గత కొంతకాలంగా హైదరాబాద్‌కు చెందిన తన ప్రియురాలు కావ్య రెడ్డితో ప్రేమలో ఉన్నారు. ఇప్పుడామెతో ఏడు అడుగులు వేయబోతున్నారు.

3/9

ఆదివారం (ఏప్రిల్ 05) హైదరాబాద్‌లోని ఓ రిసార్ట్‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్యల వివాహ నిశ్చితార్థం గ్రాండ్‌గా జరిగింది.

4/9

ఈ కార్యక్రమానికి బెల్లంకొండ సురేష్ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అతి తక్కువ మంది అతిథులు మాత్రమే హాజరయ్యారు.

5/9

ఎంగేజ్మెంట్ రోజున శ్రీనివాస్ ‘Will You Marry Me?’ అని రాసి ఉన్న టీషర్ట్స్ ధరించిన స్నేహితుల మధ్య కావ్యకు రింగ్ తొడిగి సర్‌ప్రైజ్ చేశారు.

6/9

ఈ వివాహ నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

7/9

గత కొంత కాలంలో ప్రేమలో ఉన్న సాయి శ్రీనివాస్ మార్చి నెలలో తనకు కాబోయే భార్య కావ్య రెడ్డిని పరిచయం చేసిన విషయం తెలిసిందే.

8/9

అప్పటి నుంచి వీరి వివాహానికి సంబంధించిన వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. వీరిద్దరి వివాహం ఏప్రిల్ 29న ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో జరగనుంది.

9/9

ప్రేమ, ఆత్మీయత కలబోసిన ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు చూసి అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Updated Date - Apr 07 , 2026 | 08:50 PM