సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఆ ఓటీటీలో.. వ‌ర‌ల‌క్ష్మి ‘పోలీస్ కంప్లైంట్’

ABN, Publish Date - Jul 30 , 2026 | 09:15 PM

నవీన్ చంద్ర, వరలక్ష్మి శరత్‌కుమార్, కృష్ణసాయి, రాగిణి ద్వివేది ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘పోలీస్ కంప్లైంట్’

Police Complaint

హారర్, యాక్షన్, థ్రిల్లర్ మేళవింపుతో నవీన్ చంద్ర, వరలక్ష్మి శరత్‌కుమార్, కృష్ణసాయి, రాగిణి ద్వివేది ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘పోలీస్ కంప్లైంట్’ (Police Complaint). ఎంఎస్‌కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై బాలకృష్ణ మహారాణా నిర్మించిన ఈ సినిమాకు సంజీవ్ మేగోటి దర్శకత్వం వహించారు. ‘చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ’ అనే వినూత్నమైన కాన్సెప్ట్ ఆధారంగా కథ హారర్, థ్రిల్లర్‌తో పాటు యాక్షన్, భావోద్వేగాలతో సినిమా సాగుతుంది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.

క‌థ విష‌యానికి వ‌స్తే.. సినిమా ఆరంభ‌మే ఓ గర్భిణి మహిళ హత్యతో అవుతుంది. క్షుద్రపూజల పేరుతో జరిగినట్లు అనుమానిస్తున్న ఈ హత్య కేసు సంవత్సరాల పాటు మూలన పడిపోతుంది. కొన్నాళ్ల త‌ర్వాత‌ డాడీ కావాలంటూ చిన్నారి అద్వైత పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతోనే కథ మొదలవుతుంది. ఆ పాప తాను డాడీ అని పిలిచిన వాళ్ళందరూ ఒక్కొక్కరు చనిపోతారు. ఈ క్ర‌మంలోనే నిబద్ధత కలిగిన పోలీస్ అధికారి (వరలక్ష్మి శరత్‌కుమార్) ఈ కేసును మళ్లీ తెరపైకి తీసుకురావడంతో కథ ట‌ర్న్ తీసుకుంటుంది. అంతేగాక పోలీస్ అధికారి భర్త డాక్టర్ రామ్ అసలు రూపం బయటపడుతుంది.

అప్పుడు పోలీస్ అధికారిణి ఏ నిర్ణయం తీసుకుంది. వరుస హత్యల వ్యవహారం వెనుక ఏం జరుగుతుంది? వారిని ఎవరు చంపేస్తారు? ఎందుకు చంపేస్తారు? ఈ మరణాల వెనుక నిజంగా అతీంద్రియ శక్తులున్నాయా? అనే ప్రశ్నలతో కథ ముందుకు సాగుతుంది. విచారణలో మూఢనమ్మకాలు, అవినీతి, దాచిపెట్టిన నేరాలు, కర్మ సిద్ధాంతం వంటి అంశాలు బయటపడతాయి. ఇలాంటి ఈ చిత్రం ఈ రోజు నుంచి ఈ శుక్ర‌వారం (జూలై 31) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతోంది. హారర్, యాక్షన్, థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు ఓ లుక్ వేయ‌వ‌చ్చు.

Updated Date - Jul 31 , 2026 | 08:00 AM