‘పంచనామా’కు భావన డెడికేషన్.. ఉదయభాను ప్రశంసలు
ABN, Publish Date - Sep 11 , 2026 | 07:25 PM
ప్రముఖ యాంకర్, నటి, నిర్మాత ఉదయభాను (udaya Bhanu) తొలిసారి ఓ వెబ్ సిరీస్‌కు నిర్మాతగా వ్యవహరించారు. ఎంతో ప్యాషన్‌తో ఆమె నిర్మించిన ‘పంచనామా’ (Panchanaama) సిరీస్ ZEE5లో స్ట్రీమింగ్ కానుంది.
ప్రముఖ యాంకర్, నటి, నిర్మాత ఉదయభాను (udaya Bhanu) తొలిసారి ఓ వెబ్ సిరీస్‌కు నిర్మాతగా వ్యవహరించారు. ఎంతో ప్యాషన్‌తో ఆమె నిర్మించిన ‘పంచనామా’ (Panchanaama) సిరీస్ ZEE5లో స్ట్రీమింగ్ కానుంది. మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించిన ఈ ఆరు ఎపిసోడ్ల సిరీస్ సెప్టెంబర్ 11 నుంచి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సిరీస్ కోసం పనిచేసిన పలువురు టెక్నీషియన్ల గురించి ఉదయభాను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ముఖ్యంగా ఫ్యాషన్ డిజైనర్ భావన పోలేపల్లి డెడికేషన్‌ను ఆమె ప్రశంసించారు.
ఉదయభాను మాట్లాడుతూ “పని పూర్తయిన తర్వాత కూడా కంటెంట్ నచ్చడంతో భావన ఈ సిరీస్‌పై ఎంతో ఆసక్తి చూపించారు. సెట్స్‌లోనే ఉంటూ నాకు ఎంతో సపోర్ట్ చేసేవారు. సాధారణంగా పని పూర్తయిన తర్వాత కొందరు వెళ్లిపోతారు. కానీ భావన తనకున్న ప్యాషన్‌తో సెట్స్‌లోనే ఉండేవారు. ఇలాంటి యువత మన ఇండస్ట్రీలో మరింత మంది ఉండాలి. ఆమె కృషి, డెడికేషన్ చూస్తుంటే జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికి వెళ్తుందని నమ్ముతున్నాను” అన్నారు.
ఉదయభాను ప్రోత్సాహం మరువలేనిది: భావన పోలేపల్లి
ఫ్యాషన్ డిజైనర్ భావన పోలేపల్లి మాట్లాడుతూ “గతంలో ‘అగ్లీ స్టోరీ’, ‘లైఫ్’, ‘థాంక్యూ డియర్’ వంటి చిత్రాలకు పనిచేశాను. నా కష్టపడే తత్వాన్ని గుర్తించిన ఉదయభాను గారు ‘పంచనామా’ సెట్స్‌లో నాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. నాపై అంత నమ్మకం ఉంచి అవకాశం ఇచ్చినందుకు ఆమెకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సిరీస్ నిర్మాత ఉదయభాను, ఆమె భర్త విజయ్, ZEE5 సంస్థకు, దర్శకుడు మోహన్ శ్రీవత్స గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఒక వుమెన్ ప్రొడ్యూసర్‌గా ఉన్నప్పుడు ఎలాంటి ఛాలెంజెస్ ఎదురవుతాయో దగ్గరగా ఉండి చూశాను. సినిమా కోసం చాలా కష్టపడి పని చేసాము. ఇండస్ట్రీలో మరింత మంది మహిళా నిర్మాతలు రావాలి' అన్నారు.