సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఓటీటీలోకి వచ్చేస్తోన్న ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’.. ఎప్పుడంటే

ABN, Publish Date - Jul 04 , 2026 | 10:59 PM

ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్‌కు అభిమాన హీరో అయిన వడ్డే నవీన్‌.. చాలా గ్యాప్ తర్వాత ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

Transfer Trimurthulu Poster

ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్‌కు అభిమాన హీరో అయిన వడ్డే నవీన్‌ (Vadde Naveen).. చాలా గ్యాప్ తర్వాత ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ (Transfer Trimurthulu) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. 2016 నుంచి గ్యాప్ తీసుకున్న వడ్డే నవీన్.. మళ్లీ ఇప్పుడు రీ ఎంట్రీ ఇవ్వడంతో ఈ సినిమా బాగా వార్తలలో హైలెట్ అయ్యింది. రాశీ సింగ్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాతో కమల్ తేజ నార్ల దర్శకుడిగా పరిచయమయ్యారు. ఇన్వెస్టిగేటివ్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమైంది. జీ 5 (Zee 5) ఓటీటీలో జూలై 17 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్‌కు రానుంది. థియేటర్లలో ఈ సినిమాను మిస్సయిన వారంతా జూలై 17 నుంచి ఓటీటీలో ఈ సినిమాను వీక్షించవచ్చు.


ఈ సినిమా కథ విషయానికి వస్తే.. త్రిమూర్తులు (వడ్డే నవీన్) నిజాయతీ గత కానిస్టేబుల్‌. ఆయన భార్య లక్ష్మీ (రాశీ సింగ్‌).. వాళ్ళకో పాప. ఇలా చిన్న కుటుంబం అతనిది. 10 ఏళ్ల సర్వీస్‌లో 55 సార్లు ట్రాన్స్‌ఫర్‌ అవుతాడు. అతని తండ్రి శ్రీనివాసులు కూడా నిజాయతీ గల పోలీస్‌. ఆయన బాటలోనే నీతి-నిజాయతీలతో ముందుకు సాగాలనుకుంటాడు. అలా అరకులోని ఓ పోలీస్‌ స్టేషన్‌కు ట్రాన్స్‌ఫర్‌ కాగా అక్కడ ఓ ప్రియమ్మ అనే యువతి మానభంగంకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ కాపీ దొరుకుతుంది. దానిని ఫైల్‌ చేసింది త్రిమూర్తులు తండ్రే! అసలు 20 ఏళ్లగా ఆ కేసు పక్కన పడటానికి కారణం ఏంటి? దీని వెనకున్నది ఎవరు? ముఖ్యమంత్రి కమల (శిల్ప తులస్కర్‌)కు ఈ కేసుకు ఉన్న సంబంధం ఏంటి? అసలు ప్రియమ్మ బతికుందా లేదా? ఈ కేసును త్రిమూర్తులు ఎలా చేధించారు? అనేది ఈ సినిమా కథ.

ఇవి కూడా చదవండి:

సుకుమార్- దేవిశ్రీ ప్రసాద్ కాంబోకి బ్రేక్? కారణమిదేనా?!

ఇదే ఈ బాబాయ్- అబ్బాయ్ డెబ్యూ స్పెషాలిటీ!

అఖిల్ కోసం రంగంలోకి ఎన్టీఆర్? ఇక ఊహించుకోండి!

Updated Date - Jul 04 , 2026 | 10:59 PM