‘థాంక్యూ సుబ్బారావు’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఇవే డిటైల్స్!
ABN, Publish Date - Jun 15 , 2026 | 10:28 PM
‘ఓ.. పిట్టకథ’, ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’, ‘రేపు ఉదయం పది గంటలకు’.. వంటి చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న చెందు ముద్దు నుంచి మరో వైవిధ్యభరిత చిత్రం రాబోతోంది. ఈ మూవీ డైరెక్ట్ ఓటీటీలో విడుదల కాబోతోంది.
‘ఓ.. పిట్టకథ’, ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’, ‘రేపు ఉదయం పది గంటలకు’.. వంటి చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న చెందు ముద్దు నుంచి మరో వైవిధ్యభరిత చిత్రం రాబోతోంది. కాకపోతే, ఈ చిత్రం థియేటర్లలో కాదు.. ఓటీటీలో విడుదల కాబోతోంది. చెందు ముద్దు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సరికొత్త సినిమా పేరు ‘థాంక్యూ సుబ్బారావు’ (Thank You Subbarao). ఈ మూవీని కె రాఘవేంద్ర రెడ్డి సమర్పణలో కుర్ర పొడక్షన్స్ బ్యానర్ పై దినేష్ కుర్ర నిర్మించారు. ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు రీసెంట్‌గా విడుదలైన టీజర్ మంచి స్పందనను రాబట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ వివరాలను మేకర్స్ తెలియజేశారు.
కామెడీ, యాక్షన్, లవ్, సస్పెన్స్, థ్రిల్ ఇలా అన్ని అంశాలను జోడించి రూపుదిద్దుకున్న ఈ చిత్రం జూన్ 18 నుంచి ఆహా (Aha OTT)లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ విషయం తెలియజేస్తూ మేకర్స్ వదిలిన పోస్టర్ వైరల్ అవుతోంది. అలాగే చిత్ర ట్రైలర్‌ని కూడా మేకర్స్ వదిలారు. ఓ డిఫరెంట్ సబ్జెక్ట్, కంటెంట్‌తో వస్తున్న ఈ మూవీ కచ్చితంగా ఓటీటీ ప్రేక్షకుల ఆదరణను పొందుతుందని మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు.
ఇక తాజాగా విడుదలైన ట్రైలర్‌ని గమనిస్తే.. హీరో, హీరోయిన్ ట్రాక్ రీఫ్రెషింగ్‌గా అనిపిస్తోంది. ట్రైన్‌లో తెలియని ఓ అమ్మాయి.. ఊరు, పేరు, మొహం కూడా తెలియని ఓ అబ్బాయి చుట్టూ తిరిగే ఈ క్రైమ్ స్టోరీని ఉత్కంఠ భరితంగా తెరకెక్కించారని ట్రైలర్ తెలియజేస్తోంది. సస్పెన్స్, థ్రిల్లింగ్, ఫీల్ గుడ్ ఎమోషన్, కామెడీ, లవ్ ఎలిమెంట్స్‌తో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో చంద్రహాస్ కోట్ల, లావణ్య సాహుకార, రోహిత్ రెడ్డి యర్రంరెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు. ప్రిన్స్ హెన్రీ సంగీత దర్శకుడిగా, పంకజ్ తొట్టాడ కెమెరామెన్‌గా, డి. వెంకట్ ప్రభు ఎడిటర్‌గా వర్క్ చేసిన ఈ మూవీ.. ‘ఆహా’ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో తెలియాలంటే.. మాత్రం జూన్ 18 వరకు వెయిట్ చేయాల్సిందే.
ఇవి కూడా చదవండి:
మెగా రికార్డ్.. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఫస్ట్ టైమ్!
సాయి పల్లవి అనుకున్నప్పుడు ఆ సీన్స్ లేవు: ‘మా ఇంటి బంగారం’ టీమ్‌తో చిట్ చాట్
ఎయిర్ పోర్ట్‌లో వడ్డే నవీన్ పరపతి చూసి షాకయ్యా: వివి వినాయక్