సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

డైరెక్ట్‌.. ఓటీటీకి అదిరిపోయే ఎమోష‌న‌ల్ యాక్ష‌న్‌ థ్రిల్ల‌ర్‌

ABN, Publish Date - Aug 25 , 2026 | 09:51 PM

బాలీవుడ్‌లో లేడీ ఒరియంటెడ్ సినిమాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారిన తాప్సీ ప‌న్ను న‌టించిన కొత్త హిందీ చిత్రం గాంధారి.

Gandhari

బాలీవుడ్‌లో లేడీ ఒరియంటెడ్ సినిమాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారిన తాప్సీ ప‌న్ను (Taapsee Pannu) న‌టించిన కొత్త హిందీ చిత్రం గాంధారి (Gandhari ). నెట్‌ఫ్లిక్స్ ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందించిన‌ చిత్రం ఇప్పుడు డైరెక్ట్‌గా డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది.ఈ నేప‌థ్యంలో మంగ‌ళ‌వారం రోజున మేక‌ర్స్ రిలీజ్ చేసిన ట్రైల‌ర్ అద్యంతం ఆక‌ట్టుకునేలా ఉంది. దర్శకుడు దేవాశిష్ మఖీజా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని కనికా ధిల్లన్ రచించి నిర్మించారు. ఇప్పటికే 'హసీన్ దిల్‌రుబా' వంటి చిత్రాలతో ఆకట్టుకున్న తాప్సీ-కనికా కాంబినేషన్ మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

ఈ సినిమాలో తాప్సీ బాని అనే తల్లి పాత్రలో కనిపించనుంది. తన కూతురు కిడ్నాప్‌కు గురైన తర్వాత ఆమె చేసే పోరాటమే కథకు ప్రధానాంశం. అదే స‌మ‌యంలో త‌న కంటి చూపును కోల్పోవ‌డం ఈ క్ర‌మంలో కూతురిని వెతికే క్రమంలో ఎదురయ్యే ప్రమాదాలు, వాటి వెనుక దాగి ఉన్న రహస్యాల మధ్య చూపు లేకున్నా తల్లి ఎలా పోరాడింది ట్రైలర్‌లో శక్తివంతంగా చూపించారు. తాప్సీ నటన, యాక్షన్ సన్నివేశాలు గూస్‌బంప్స్ తీసుకు వ‌చ్చేలా ఉన్నాయి.

కాగా తాజాగా రిలీజ్ అయిన ట్రైల‌ర్ ప్రేక్షకుల నుంచి విశేష స్పందన అందుకుంటోంది. విడుదలైన కొద్ది గంటల్లోనే ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి చేరి సినిమాపై అంచనాలను మరింత పెంచింది. కాగా ఈ సినిమా సెప్టెంబ‌ర్ 3 నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీలో హిందీతో పాటు తెలుగు ఇత‌ర భాష‌ల్లోనూ స్ట్రీమింగ్ అవ‌నుంది. మంచి యాక్ష‌న్‌, ఎమోష‌న‌ల్ థ్రిల్ల‌ర్ సినిమా చూడాల‌నుకునే వారికి ఈ మూవీ మంచి ఆఫ్స‌న్ కానుంది. ఇంకెందుకు ఆల‌స్యం ఇప్పుడే మీ వాచ్‌లిస్టులో జ‌త చేసుకోండి.

Updated Date - Aug 25 , 2026 | 10:08 PM