System OTT: హై స్టేక్స్ కోర్ట్ రూం థ్రిల్లర్.. ‘సిస్టమ్’ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ABN, Publish Date - May 06 , 2026 | 10:05 PM
ఇండియాలో కోర్ట్ రూం డ్రామాలు అరుదుగా వచ్చినా, సంచలనాలను క్రియేట్ చేస్తుంటాయి. కోర్ట్‌రూం థ్రిల్లర్ చిత్రాలను ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అలాంటి వారందరి కోసం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ హై స్టేక్స్ కోర్ట్ రూం థ్రిల్లర్‌ను తీసుకొస్తోంది.
ఇండియాలో కోర్ట్ రూం డ్రామాలు అరుదుగా వచ్చినా, సంచలనాలను క్రియేట్ చేస్తుంటాయి. కోర్ట్‌రూం థ్రిల్లర్ చిత్రాలను ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అలాంటి వారందరి కోసం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ హై స్టేక్స్ కోర్ట్ రూం థ్రిల్లర్‌ను తీసుకొస్తోంది. అశ్విని అయ్యర్ తివారీ దర్శకత్వంలో బావేజా స్టూడియోస్ బ్యానర్‌పై హర్మన్ బావేజా, పమ్మి బావేజా, స్మిత బలిగా నిర్మించిన చిత్రం ‘సిస్టమ్’ (System). మే 22 నుంచి ఈ అద్భుతమైన కోర్ట్ రూం థ్రిల్లర్ స్ట్రీమింగ్ కాబోతున్నట్లుగా అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) అధికారికంగా ప్రకటించింది. అధికారం, న్యాయం మధ్య పోరాటాన్ని అన్వేషించే అద్భుతమైన కథనంతో రూపుదిద్దుకున్న ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ప్రపంచవ్యాప్తంగా 240కి పైగా దేశాలు, ప్రాంతాలలో ప్రసారం కానుంది.
ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా (Sonakshi Sinha), జ్యోతిక (Jyothika), అశుతోష్ గోవారికర్ (Ashutosh Gowariker) ప్రధాన పాత్రలలో నటించారు. వీరితో పాటు ప్రీతి అగర్వాల్, ఆదినాథ్ కొఠారే, ఆశ్రియా మిశ్రా, గౌరవ్ పాండే, సయన్‌దీప్ గుప్తా తదితరులు ఇతర పాత్రలను పోషించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ నేహా రాజవంశ్, నిరాడంబరమైన స్టెనోగ్రాఫర్ సారిక రావత్‌ల మధ్య జరిగే సంభాషణలు, వారి మధ్య ఊహించని స్నేహం, వారు పని చేస్తున్న వ్యవస్థనే సవాలు చేస్తూ, అణచివేయబడిన అన్యాయాలను వెలికితీయడం వంటి అంశాలు ఈ సినిమా చూస్తున్న వారికి థ్రిల్లింగ్‌గా అనిపిస్తాయని, మేకర్స్ చెబుతున్నారు. హర్మన్ బావేజా, అరుణ్ సుకుమార్, అశ్విని అయ్యర్ తివారీ, తస్నీమ్ లోఖండ్వాలా, అక్షత్ గిల్డియాల్ రచించిన ఈ చిత్రం ఎమోషనల్‌గా సాగుతూనే, న్యాయపరమైన నాటకంతో మేళవించి, ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసేలా ఉంటుందని, అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా ఇదని అమెజాన్ ప్రైమ్ తెలుపుతోంది.
ఇవి కూడా చదవండి:
Lavanya Tripathi: ఇకపై ప్రెగ్నెంట్ అని తెలిస్తే.. ఆ పని చేయను
Peddi Movie: ‘పెద్ది’ విషయంలో బుచ్చిబాబు స్ట్రాటజీ ఏంటి? ఓన్లీ రామ్ చరణేనా!
‘సన్ రైజర్స్’కు సపోర్ట్ చేస్తున్న ఈ భామ ఎవరో గుర్తు పట్టారా?
Varanasi: ‘వారణాసి’కి వాటర్ కొరత!.. మహేష్ సినిమాకు ప్రభుత్వం షాక్!