సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Varanasi OTT: ఆ ఓటీటీకి రాజమౌళి షాక్.. వారణాసి కోసం కొత్త ప్లాన్!

ABN, Publish Date - Nov 09 , 2026 | 08:19 PM

మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న వారణాసి సినిమా ఓటీటీ హక్కులపై ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి.

Varanasi Movie

భారతీయ సినిమా చరిత్రను తిరగరాసిన దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి (Rajamouli), టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కలయికలో రాబోతున్న విజువల్ వండర్ వారణాసి (Varanasi Movie). ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పటి నుంచే ప్రపంచవ్యాప్తంగా అంచనాలు ఆకాశాన్ని తాకాయి. మైథలాజికల్ టచ్‌తో కూడిన భారీ గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం గురించి ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన వార్త తెగ చక్కర్లు కొడుతోంది. సాధారణంగా ఒక సినిమా సెట్స్ పైకి వెళ్లాక బిజినెస్ మొదలవుతుంది. కానీ వారణాసి విషయంలో షూటింగ్ దశలోనే ఓటీటీ రైట్స్ కోసం గ్లోబల్ ప్లాట్‌ఫామ్స్ పోటీ పడుతున్నాయి. అయితే నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఇచ్చిన భారీ ఆఫర్‌ను మేకర్స్ రిజెక్ట్‌ చేశారట. దానికి కారణం కూడా జక్కన్నే అని టాక్‌ వినిపిస్తుంది.

శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత కేఎల్ నారాయణ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో అంతర్జాతీయ నటీనటులు భాగమవుతున్నారు. బాలీవుడ్ తోపాటు హాలీవుడ్‌లోనూ తనదైన ముద్ర వేసిన ప్రియాంక చోప్రా, మలయాళ స్టార్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 2027 ఏప్రిల్ 7న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి టీమ్ ఇప్పటినుంచే ప్రణాళికలు రచిస్తోంది. ఈ పాన్-వరల్డ్ ప్రాజెక్ట్ డిజిటల్ రైట్స్ దక్కించుకునేందుకు ప్రముఖ అంతర్జాతీయ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ రంగంలోకి దిగింది. ఏకంగా 150 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని ఆఫర్ చేసినట్లు వార్తలు వచ్చాయి.

ఒక భారతీయ సినిమాకు ఇది చాలా పెద్ద మొత్తమే అయినప్పటికీ, వారణాసి మేకర్స్ మాత్రం ఈ డీల్‌పై పెద్దగా ఆసక్తి చూపించలేదు. సినిమా బడ్జెట్, జక్కన్నకున్న ఇంటర్నేషనల్ బ్రాండ్ ఇమేజ్, ఆర్ఆర్ఆర్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆయన సినిమాలకు ఏర్పడిన క్రేజ్ ముందు ఈ ఆఫర్ చాలా చిన్నదని నిర్మాతలు భావించారు. ఇక్కడే రాజమౌళి తన అసలైన బిజినెస్ బ్రెయిన్‌ను ఉపయోగించారు. సాధారణంగా మన దేశంలో రూపొందే భారీ పాన్-ఇండియా చిత్రాల డిజిటల్ రైట్స్‌ను అన్ని భాషలకు కలిపి ఒకే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు విక్రయిస్తుంటారు. అయితే వారణాసి విషయంలో ఒకే ప్లాట్‌ఫామ్‌కు సర్వహక్కులు ఇచ్చే పద్ధతికి స్వస్తి పలకాలని నిర్ణయించారు. రీజియన్ల వారీగా హక్కులను విభజించి విక్రయించే ప్రత్యేక వ్యూహాన్ని తెరపైకి తెచ్చారు.

ఇందులో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలతో కూడిన సౌత్ వర్షన్ రైట్స్‌ను ఒక ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌కు ఇవ్వనున్నారు. రెండవది.. నార్త్ ఇండియా మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని, హిందీ వర్షన్ డిజిటల్ హక్కులను మరో అగ్ర సంస్థకు అందించాలని చూస్తున్నారు. మూడవది.. అంతర్జాతీయ ప్రేక్షకుల కోసం ఇంగ్లీష్‌తో సహా ఇతర విదేశీ భాషల గ్లోబల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రత్యేకంగా ఒక అంతర్జాతీయ దిగ్గజ ప్లాట్‌ఫామ్‌కు విక్రయించేందుకు చర్చలు సాగిస్తున్నారు.

ఇలా మూడు వేర్వేరు మార్కెట్లను విడదీసి విక్రయించడం వల్ల కేవలం డిజిటల్ రైట్స్ ద్వారానే ఊహించని రీతిలో భారీ ఆదాయం సమకూరుతుంది. ఒక్క ఓటీటీ బిజినెస్ ద్వారానే నిర్మాణ వ్యయంలో సింహభాగాన్ని రిలీజ్‌కు ముందే రికవరీ చేయవచ్చని మేకర్స్ గట్టి నమ్మకంతో ఉన్నారు. ఈ మార్కెటింగ్ స్ట్రాటజీ గనుక వర్కవుట్ అయితే, భారతీయ సినీ వాణిజ్య రంగంలో ఇదొక సరికొత్త బెంచ్‌మార్క్‌గా నిలవనుంది. సినిమా పూర్తి స్థాయి నిర్మాణ పనుల్లోకి వెళ్లకముందే.. అంటే ఈ ఏడాది ముగిసేలోపే ఈ డిజిటల్ ఒప్పందాలన్నింటినీ పూర్తి చేయాలని నిర్మాతలు లక్ష్యంగా పెట్టుకున్నారు. జక్కన్న పెట్టిన ప్రతి రూపాయికి న్యాయం చేసి లాభాల బాట పట్టించుకోవాలనే నిర్ణయం ఎంత వరకు వర్కవుట్‌ అవుతుందో చూడాలి.

Updated Date - Nov 09 , 2026 | 08:19 PM