సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఓటీటీకి వ‌చ్చేస్తున్న శ్రీ విష్ణు లేటెస్ట్ సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్‌

ABN, Publish Date - Mar 30 , 2026 | 09:54 AM

ఇటీవ‌ల థియేట‌ర్ల‌కు వ‌చ్చి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌ చిత్రం మృత్యుంజ‌య్ డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైంది.

Sree Vishnu

ఇటీవ‌ల థియేట‌ర్ల‌కు వ‌చ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌ చిత్రం మృత్యుంజ‌య్ (Mrithyunjay). సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న జంట శ్రీ విష్ణు (Sree Vishnu), మెనికా రెబా జాన్ (rebba mounika john) కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రాన్ని సందీప్ గుణ్ణం (Gunnam sandeep) నిర్మించ‌గా సుకుమార్ శిష్యుడు హుస్సేన్ షా కిర‌ణ్ (Hussain Sha Kiran) డైరెక్ట్ చేశారు. మార్చి మొద‌టి వారంలో విడుద‌లైన ఈ సినిమా తొలి రోజు నుంచే మంచి మౌత్ టాక్ సంపాదించుకున్న‌ప్ప‌టికీ ప్ర‌మోష‌న్స్ అంత‌గా లేక జ‌నాల‌కు రీచ్ కాలేక పోయింది. ఇప్పుడీ చిత్రం డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైంది.

క‌థ విష‌యానికి వ‌స్తే.. ఓ మీడియా ఛాన‌ల్‌లో క్రైమ్ రిపోర్ట‌ర్ కావాల‌ని ప్ర‌య‌త్నాలు చేసి అది స‌ఫ‌లం అవ‌క అదే ఛాన‌ల్‌లో అడ్వ‌ర్టైజ్‌మెంట్స్ విభాగంలో చేరుతాడు జ‌య్ (మృత్యుంజ‌య్). త‌న ప‌రిస‌రాల‌లో ఎవ‌రైనా చ‌నిపోతే అక్క‌డ‌కు వెళ్లి కాస్త హాడావుడి చేసి శ్ర‌ద్ధాంజ‌లి యాడ్స్ తీసుకువ‌స్తుంటాడు. ఈ నేప‌థ్యంలోనే అచ్యుత శర్మ అనే వ్యక్తి చనిపోగా అక్కడికి వెళ్లిన జ‌య్ అచ్యుత్‌ కూతురు అంజలి ఏడ‌వకుండా దిగాలుగా ఉండ‌డాన్ని జ‌య్ గ‌మ‌నిస్తాడు. అంతేగాక‌ త‌న జీవితంలో త‌న‌కు స్వ‌యంగా జ‌రిగిన ఓ ఇన్సిడెంట్‌ను గుర్తు చేసుకుని అంజ‌లి బాధ వెన‌కాల కూడా ఏదో గ‌ట్టి కార‌ణం ఉంద‌ని ఆ చిన్నారి ప్రశ్నకు సమాధానం వెతకాలనుకుంటాడు. స‌రిగ్గా అదే స‌మ‌యంలో అచ్యుత్ మ‌ర‌ణంలానే మ‌రో వ్య‌క్తి చ‌నిపోవ‌డం జ‌య్ గుర్తించి ఈ మ‌ర‌ణాల వెనుక ర‌హాస్యాన్ని చేధించాల‌నుకుంటాడు.

అయితే.. ఇది మ‌ర్డ‌ర్ కేసుగా భావించి ఇన్వెస్టిగేట్ చేస్తున్న పోలీస్ ఆఫీస‌ర్ సీత ఎలాంటి అధారాలు ల‌భించ‌క డైలామాలో ప‌డుతుంది. మ‌రోవైపు ఇవి హ‌త్య‌ల‌ను ఎవ‌రో కావాల‌ని చేస్తున్నార‌ని జ‌య్ ఈ విష‌యాల‌ను పోలీసుల వ‌ర‌కు తీసుకెళ్లిన వారు అంత‌గా ప‌ట్టించుకోరు. దీంతో జ‌య్ స్వ‌యంగా ఈ హ‌త్య‌ల మిస్ట‌రీని చేధించేందుకు రంగంలోకి దిగుతాడు. కానీ ఆ హంత‌కుడు జ‌య్‌ క‌న్నా క్ల‌వ‌ర్‌గా ఆలోచిస్తూ అంతుప‌ట్ట‌కుండా ఉంటాడు. ఈ నేప‌థ్య‌లో చివ‌ర‌కు ఆ హంత‌కుడు ప‌ట్టుబ‌డ్డాడా, అత‌డు అస‌లు హ‌త్య‌లు ఎందుకు చేశాడు దాని వెన‌కాల ఉన్న వ్య‌క్తులు ఎవ‌రు, అత‌నిని ప‌ట్టుకునేందుకు జ‌య్ ఎన్ని ర‌కాల ప్ర‌య‌త్నాలు చేశాడు చివ‌ర‌కు క‌థ ఎలా ముగించాడన్నదే సినిమా క‌థ‌.

మ‌ల‌యాళంలో త‌రుచూ ఈ జాన‌ర్‌లో సినిమాలు వ‌స్తూ ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా అల‌రించాయి. తెలుగులో ఎప్పుడో అరుదుగా ద‌శాబ్దానికొక్క‌టికి మాత్ర‌మే అలా వ‌చ్చి ఇలా వెళ్లిపోయాయి. చాలా కాలం త‌ర్వాత ఈ సినిమా వ‌చ్చి ఆ స్థానాన్ని భ‌ర్తీ చేసింది. టాలీవుడ్ సైతం ఇలాంటి సినిమాలు చేయ‌గ‌ల‌దు అని చూపించింది. ఒక చిన్న పాయింట్‌ను తీసుకుని చివ‌రి వ‌ర‌కు ఎక్క‌డా క‌థ బిగి స‌డ‌ల‌కుండా ఈ మృత్యుంజ‌య్ చిత్రాన్ని రూపొందించారు. థియేట‌ర్‌లో మిస్స‌యిన వారు ఇక ఓటీటీలో చూసేందుకు రెడీ అవ్వండి. ఏప్రిల్ 3 నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix )లో తెలుగుతో పాటు ఇత‌ర భాష‌ల్లోనూ స్ట్రీమింగ్ అవ‌నుంది. ఎక్క‌డా ఎలాంటి అస‌భ్య‌త‌, వ‌ల్గారిటీ లేవు. కుటుంబం అంతా క‌లిసి చూసేయ‌వ‌చ్చు.

Updated Date - Mar 30 , 2026 | 11:42 AM