Parasakthi OTT: ఓటీటీకి.. శ్రీలీల తొలి తమిళ సినిమా! తెలుగులోనూ
ABN, Publish Date - Feb 06 , 2026 | 07:34 AM
గత నెలలో తమిళనాట థియేటర్లకు వచ్చి ప్రేక్షకులను అలరించడంలో విఫలమైన చిత్రం పరాశక్తి డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేస్తోంది.
గత నెలలో తమిళనాట థియేటర్లకు వచ్చి ప్రేక్షకులను అలరించడంలో విఫలమైన చిత్రం పరాశక్తి (Parasakthi). శివ కార్తికేయన్ (Sivakarthikeyan), రవి మోహన్ (Ravi Mohan), ఆధర్వ మురళి (Atharvaa), శ్రీలీల (Sreeleela) వంటి భారీ క్యాస్టింగ్‌తో వచ్చిన ఈ చిత్రానికి ఆకాశమే హద్దురా ఫేమ్ సుధా కొంగర (Sudha Kongara) దర్శకత్వం వహించింది. సుమారు. రూ.150 కోట్ల వరకు బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అందులో సగం వసూళ్లు మాత్రమే రాబట్టి తీవ్రంగా నిరాశ పర్చింది. పైగా తెలుగులో రిలీజ్ కాకపోవడం కూడా పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లైంది. అయితే ఇప్పుడ ఉఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేస్తోంది.
కథ విషయానికి వస్తే.. 1960 సమయంలో దేశంలో హిందీ భాషను అధికారిక భాషగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని తీవ్రంగా నిరసిస్తూ.. చెన్నైలో నిజంగా జరిగిన ఘటలను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కించారు. ఆ సమయంలో ఓ సంఘానికి లీడర్‌గా ఉన్న హీరో తన టీంతో కలిసి రైలును తగులబెడతారు. ఈ ఘటనలో ఈ రైలులో ప్రయాణిస్తున్న ఓ ఇంటిలిజెంట్ బ్యూరో ఆఫీసర్ గాయ పడగా, హీరో మిత్రుడు చనిపోతాడు. దీంతో తీవ్ర వేదనకు గురైన హీరో అక్కడితో ఆ సంఘాన్ని, పోరాటాలను వదిలేసి ఇంజినీరింగ్ చదువుతన్న తన తమ్ముడి చదువు కోసం ఆవిరి ఇంజిన్‌తో నడిచే రైల్‌లో ఫైర్‌మ్యాన్‌గా పని చేయడం ప్రారంభిస్తాడు.
అయితే.. హీరో తమ్ముడు మాత్రం అన్నమాటను వినకుండా హిందీ భాషకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటు ప్రతీ దానికి కొట్లాల వరకు వెళుతూ పోలీసుల దృష్టిలో పడతాడు. గతంలో అన్న వదిలేసిన సంఘంలో చేరతాడు. అన్నా తమ్ముడు ఇద్దరు ఒకొరికొకరు భిన్న దృవాలుగా ఉంటుంటారు. అదే సమయంలో ఈ ఉద్యమాన్ని అణిచివేసేందుకు ను ప్రభుత్వం రంగంలోకి దింపుతుంది. ఈ క్రమంలోనే అనోకోకుండా ఒక రోజు ఓ వృద్దురాలికి ఎదురైన ఘటనతో హీరోలో కాస్త మార్పు వచ్చి సామాన్య ప్రజల కోసంపోరాడాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో ఆ అన్నాదమ్ములకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాలు, ఆ ఆఫీసర్‌తో ఏం చేశాడు వంటి నిజ జీవిత ఘటనలను టచ్ చేస్తూ సినిమా సాగుతుంది. శ్రీలీల రేడియోలో పని చేసే అమ్మాయిగా కనిపిస్తుంది.
ఇదిలాఉంటే.. తమిళంతో పాటే తెలుగులోనూ రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం ఇక్కడే 5 భారీ స్ట్రెయిట్ తెలుగు చిత్రాల రిలీజ్ ఉండడంతో ఈ చిత్ర రిలీజ్ వాయిదా వేసుకున్నారు. కానీ తమిళంలోనే మూవీకి డివైడ్ టాక్ రావడంతో థియేటర్ రిలీజ్ ఆపేసి స్ట్రెయిట్‌గా తెలుగుతో పాటు ఇతర భాషల్లో జీ5 (Zee5) ఓటీటీలో విడుదల చేస్తున్నారు. ఫిబ్రవరి 7 శనివారం నుంచి అందుబాటులో ఉంది. మనకు అంతగా టచ్ లేని సబ్జెక్టు కాబట్టి ఈ సినిమా వారికి అంతగా కనెక్ట్ అయ్యే అవకాశం లేదు. శివ కార్తికేయన్, జయం రవి ఫ్యాన్స్ ఒకసారి చూసేయవచ్చు.