Dhandoraa OTT: ఓటీటీలో దండోరా.. మనసును టచ్ చేసే ఎమోషనల్ డ్రామా! డోంట్ మిస్
ABN, Publish Date - Jan 14 , 2026 | 08:33 AM
గత నెలలో థియేటర్లకు వచ్చి మిమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకున్న చిత్రం దండోరా డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
గత నెలలో థియేటర్లకు వచ్చి మిమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకున్న చిత్రం దండోరా (Dhandoraa). శివాజీ (Shivaji), నవదీప్ (Navdeep), నందు (Nandu), బింధు మాదవి (Bindu Madhavi), రవి కృష్ణ కీలక పాత్రల్లో నటించగా మురళీ కాంత్ దర్శకత్వం వహించాడు. విడుదలకు ముందు నుంచే పాటలు, కంటెంట్ విషయంలో పాజిటివ్ టాక్ ఉన్న ఈ చిత్రం ప్రేక్షకులను మాత్రం థియేటర్లకు రప్పించలేకపోయింది. అంతేగాక ఈ సినిమా సమయంలోనే శివాజీ హీరోయిన్ల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు సోషల్‌మీడియాను అలతాకుతలం చేశాయి. కాగా ఇప్పుడు ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
కథ విషయానికి వస్తే.. శివాజీ ఓ అగ్ర కులానికి చెందిన వ్యక్తి. భార్చ చనిపోయినా తన కొడుకు, కూతుర్లతో కలిసి హాయిగా జీవిస్తూ ఉంటాడు. అయితే ఆ గ్రామంలో కులం కట్టుబాట్లు అధికంగా ఉంటాయి. శివాజీ సైతం వాటికే కట్టుబడి తమ కులం కానీ వారి సంబంధాల విషయంలో సీరియస్‌గా ఉంటాడు. ఆ కుటం పెద్దలు సైతం తమ కులం కానీ వారిని ఏం చేయడానికైనా వెనుకాడరు. కాగా అదే సమయంలో శివాజీ కూతురు మరో కులం అబ్బాయిని ప్రేమించడం, ఆ విషయం కస్త శివాజీకి తెలియడంతో గట్టిగా మందలిస్తాడు. ఈ ప్రేమ విషయం తెలుసుకున్న ఆ కులం పెద్దలు అ యువకుడిని చంపేస్తారు.
దీంతో శివాజీ కుమారుడు అతన్ని ద్వేషించి ఇంటి నుంచి వెళ్లిపోగా, కూతురు ఆత్మహత్య చేసుకుంటుంది. దీంతో ఒంటరి అయిన శివాజీ కుమిలిపోతుంటాడు. అదే సమయంలో వేశ్యతో పరిచయం అయనలో కొత్త మార్పు తీసుకు వస్తుంది. ఈ క్రమంలోనే నేను, మా కులం వాళ్లు కలిసి అ యువకుడిని హత్య చేసినట్లు కోర్టులో వాంగ్మూలం వ్వడంతో వారికిని జైలు శిక్ష వేస్తారు. దీంతో నీ వళ్ల కులానికి చెడ్డ పేరు వచ్చందని శివాజీని ఆ కులం పెద్దలు వెలేస్తారు. ఆపై.. జైలు నుంచి బయటకు వచ్చిన శివాజీ కొన్నాళ్లు చనిపోగా అంత్యక్రియలకు ఆ కులం వారు ఒప్పుకోరు.
ఈ నేపథ్యంలో.. ఒ ఊరి సర్సంచ్ ఏం చేశాడు, శివాజీకుమారుడు తిరిగి వచ్చాడా లేదా, వేశ్య కూతురు శివాజీ ఇంట్లో ఎందుకు ఉంటుంది అనే కథకథనాలతో సినిమా సాగుతుంది. మంచి పాటలతో పాటు అర్థవంతమైన డైలాగులు, సిట్యూవేషన్ కామెడీతో ఎక్కడా బోర్ కొట్టకుండా సాగుతూ చూసే ప్రతి ఒక్కరినీ ఆలోచించేలా చేస్తుంది. ఇప్పుడీ చిత్ర అమెజాన్ ప్రైమ్ (Amazon Prime Video) ఓటీటీలో ప్రసారం అవుతుంది. థియేటర్‌లో మిస్సయిన వారు, మీనింగ్‌పుల్ సినిమాలు ఇష్ట పడే వారు ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన మూవీ ఇది. డోంట్ మిస్. ముఖ్యంగా శివాజీ నటనకు అంతా ఫిదా అయిపోతారు.