Nari Nari Naduma Murari OTT: సంక్రాంతి విన్నర్.. ఓటీటీకి వచ్చేసింది
ABN, Publish Date - Feb 04 , 2026 | 06:45 AM
వరుస పరాజయాల తర్వాత హీరో శర్వానంద్, నిర్మాత అనిల్ సుంకర, హీరోయిన్ సాక్షి వైద్య కు మరువలేని సక్సెస్‌ను కట్టబెట్టిన నారీ నారీ నడుమ మురారి చిత్రం ఓటీటీకి వచ్చేసింది.
సంక్రాంతికి థియేటర్లకు వచ్చి భారీ విజయం సాధించిన చిత్రం నారీ నారీ నడుమ మురారి (Nari Nari Naduma Murari). వరుస పరాజయాల తర్వాత హీరో శర్వానంద్ (Sharwanand), నిర్మాత అనిల్ సుంకర, హీరోయిన్ సాక్షి వైద్య (Sakshi Vaidya) కు మరువలేని సక్సెస్‌ను ఈ సినిమా కట్టబెట్టింది. ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా చేరువయింది. అయితే నాలుగు పెద్ద సినిమాల పోటీ వల్ల సరైన థియేటర్లు అనుకున్న సంఖ్యలో లభించక కలెక్షన్లు పెంచుకోలేక పోయింది. ఇప్పుడు ఈ చిత్రం థియేటర్లలో మంచి రన్ ఉండగానే నిర్మాతలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు తీసుకువచ్చారు.
ఆర్కిటెక్ట్ అయిన కార్తీక్, ఓ ఫేమస్ లాయర్ కూతురు నిత్య ఒకరినొకరు ప్రేమించుకుంటారు. కూతురు అంటే తెగ ఇష్టం ఉన్న తండ్రి, అబ్బాయిని పరిచయం చేస్తే మాట్లాడి పెళ్లి చేస్తా అంటాడు. తీరా ఆ లాయర్, గౌతమ్ మాట్లాడుకున్నాక మీ మధ్య ఎలాంటి గొడవలు లేవు అది ప్రేమ కాదు పెళ్లికి ఒప్పుకోను అంటాడు. చివరకు కుమార్తె బలవంతంపై రిజిస్టర్ మ్యారేజ్‌కు ఓకే అంటాడు. తీరా రిజిస్టేషన్ ఆఫీసుకు వెళితే గతంలోనే గౌతమ్‌కు దియా అనే అమ్మాయితో పెళ్లి అయినట్లు తెలుస్తుంది. అక్కడి ఆఫీసర్ ఇది గుర్తించి, అప్పట్లో పెళ్ళి చేసుకున్న అమ్మాయితో డైవర్స్ అయినట్లు లెటర్ తీసుకువస్తే ఈ పెళ్ళికి అనుమతి ఇస్తా అంటాడు.
మరో వైపు.. గౌతమ్ తండ్రి కార్తీక్ తన ఇంట్లో పెళ్లీడు మించిపోతున్న కొడుకు ఉండగా తన భార్య చనిపోయిందని తన కూతురు వయసు ఉండే ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఓవైపు గౌతమ్ ఎలాగైనా నిత్యను వివాహం చేసుకునేందుకు చేసే ప్రయత్నాలు, మధ్యలో తన మాజీ ప్రేయసి ఎంట్రీ ఇవ్వడం, ఇంకో వైపు తన యంగ్ వైఫ్ ను ఇంప్రెస్ చేసేందుకు కార్తీక్ చేసే పనులతో సినిమా ఆద్యంతం నాన్‌స్టాప్ నవ్వులు పంచుతూ సాగుతుంది. అసలు ఎక్కడా బోర్ కొట్టకుండా, మధ్యలో ఫోన్ కూడా చూడనీయకుండా సినిమాతో పాటే జర్నీ చేసేలా చేస్తుంది.
చివరకు గౌతమ్ దియా నుంచి విడాకుల పత్రాలు తెచ్చాడా, నిత్యను పెళ్లి చేసుకున్నాడా లేదా, కార్తీక్ తన కొత్త భార్య మధ్య గ్యాప్ వచ్చి మరలా ఎలా కలిసిపోయారనే కథతో సినిమా హాయిగా సాగుతుంది. ఇప్పుడు ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్‌లో చూడలేక పోయిన వారు, చూసిన వారు మళ్లీ మళ్లీ ఈ చిత్రాన్ని చూసి ఫుల్ ఎంజాయ్ చేయవచ్చు.