Dridam OTT: ఓటీటీకి అదిరిపోయే.. లేటెస్ట్ మలయాళ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్! మైండ్‌బ్లాక్ అవ్వాల్సిందే
ABN, Publish Date - Jun 07 , 2026 | 12:32 PM
చాలా రోజుల తర్వాత మలయాళం నుంచి ఓ అద్భుతమైన మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ ద్రిడం డిజిటల్ స్ట్రీమింగ్‌కు ముస్తాబయింది.
చాలా రోజుల తర్వాత మలయాళం నుంచి ఓ అద్భుతమైన మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ ద్రిడం (Dridam) డిజిటల్ స్ట్రీమింగ్‌కు ముస్తాబయింది. గత నెల మే 8న కేరళ నాట థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం తొలి నుంచే పాజిటివ్ టాక్‌తో మంచి విజయం సొంతం చేసుకుంది. షేన్ నిగమ్ (Shane Nigam), శోభి తిలకన్ (Shobi Thilakan), కొట్టాయం రమేశ్, దినేశ్ ప్రభాకర్, నందన్ ఉన్ని కీలక పాత్రల్లో నటించారు. మార్టిన్ జోసెఫ్ (Martin Joseph)దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రఖ్యాత డైరెక్టర్ జీతూ జోసెఫ్ (Jeethu Joseph )నిర్మించడం విశేషం.
కథ విషయానికి వస్తే.. అప్పటికే పోలీస్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న విజయ్‌కొత్తగా ఓ హిల్ స్టేషన్‌లోని ఓ పోలీస్ స్టేషన్‌కు పోస్టింగ్‌పై వస్తాడు. అతను వచ్చిన మరునాటి నుంచే ఓ మర్డర్ కేసు, ఆపై రాబరీ, బ్లాక్ మెయిల్ కేసు ఇలా ఒకదాని తర్వాత మరోటి హత్య ఇతరత్రా కేసులు అన్ని గ్యాప్ లేకుండా వచ్చి పడతాయి. దీంతో విజయ్‌తో పాటు స్టేషన్‌లోని పోలీసులంతా తలమునకలై ఆ కేసులను పరిశోధించే పనిలో పడతారు. కానీ వాటిని చేదించడం వారికి కత్తి మీద సాయిలా ఉంటుంది. కిల్లర్‌ను కనిపెట్టం అంతుపట్టకుంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో విజయ్ ఆ కేసులన్నింటినీ ఛేదించ గలిగాడా లేదా, అసలు ఆ హత్యల వెనుక ఉన్న అగంతకుడు ఎవరు, ఎందుకు చేశాడనేదే కథ.
సినిమా సింపుల్‌గా స్టార్ట్ అయినప్పటికీ వెళుతు వెళుతూ సినిమా సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టేలా సాగుతుంది. మధ్యలో వచ్చే ట్విస్టులు, ముఖ్యంగా క్లైమాక్స్‌లో రివీల్ అయ్యే సన్నివేశాలు మైండ్ బ్లోయింగ్‌గా ఉంటాయి. అలాగే చివరలో వచ్చే యాక్షన్ సన్నివేశాలు మాత్రం అంతకుమించి అనే రేంజ్‌లో మితీమీరిన హింసతో చూసేవారికి షాక్ ఇస్తాయి. ఆ హింసా సన్నివేశాలు మినహా సినిమాను ఫ్యామిలీతో కలిసి చూసేయవచ్చు. కాగా ఈ చిత్రం జూన్ 12 నుంచి జియో హాట్ స్టార్ (Jio Hotstar) ఓటీటీలో మలయాళంతో పాటు తెలుగు ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ అవనుంది. థ్రిల్లర్, యాక్షన్ సినిమాలు ఇష్టపడే వారు తప్పక చూసి తీరాల్సిన పైసా వసూల్ సినిమా ఇది. డోంట్ మిస్ ఇట్.