సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Aadi Saikumar: 'శంబాల'.. ఓటీటీకి వచ్చేస్తోంది

ABN, Publish Date - Jan 15 , 2026 | 04:04 PM

గత కొన్నేళ్ళుగా విజయం కోసం ఎదురుచూస్తూ వచ్చిన ఆది సాయికుమార్ కు 'శంబాల' తో ఆ లోటు తీరింది. ఈ సినిమా ఇప్పుడు ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది.

Sambhala movie

ఆది సాయికుమార్ నటించిన రీసెంట్ హిట్ మూవీ 'శంబాల' ఆహా ఓటీటీలో ప్రీమియర్ కు రెడీ అవుతోంది. ఈ నెల 22వ తేదీ నుంచి ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ కు వస్తోంది. ఆహా గోల్డ్ సబ్ స్క్రైబర్స్ కు ఒక రోజు ముందుగానే ఎర్లీ యాక్సెస్ తో ఈ సినిమాను చూడొచ్చు. ఎప్పటికప్పుడు ఎగ్జైటింగ్ కంటెంట్ అందిస్తున్న ఆహా ఓటీటీ... 'శంబాల'తో మరోసారి కొత్త సబ్ స్క్రైబర్స్ ను ఆకర్షిస్తోంది.


గతేడాది డిసెంబర్ 25న 'శంబాల' సినిమా మిస్టికల్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకులు ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని దర్శకుడు యుగంధర్ ముని రూపొందించారు. అర్చన అయ్యర్ హీరోయిన్ గా నటించింది. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద ఈ మూవీని మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీకి ప్రవీణ్ కె బంగారి విజువల్స్, శ్రీ చరణ్ పాకాల ఆర్ఆర్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. థియేటర్స్ లో మంచి వసూళ్లు సాధించిన 'శంబాల' సినిమాను ఆహా ఓటీటీలో ప్రీమియర్ చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు.

Updated Date - Jan 15 , 2026 | 04:55 PM