సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Maa Inti Bangaram OTT: 100 కోట్ల బంగారం.. ఓటీటీకి వ‌చ్చేసింది

ABN, Publish Date - Jul 17 , 2026 | 08:04 AM

గ‌త నెల‌లో థియేట‌ర్లకు వ‌చ్చి రూ.100 కోట్లు వ‌సూలు చేసిన స‌మంత మా ఇంటి బంగారం డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది.

Samantha, Maa Inti Bangaram

సమంత (Samantha) హీరోయిన్‌గా నటించిన 'ఖుషీ' (Khushi) సినిమా విడుదలై దాదాపు మూడేళ్ళు గడిచిపోయింది. గ‌త నెల‌లో థియేట‌ర్ల‌కు వ‌చ్చి సంచ‌ల‌న విజ‌యం సాధించిన చిత్రం మా ఇంటి బంగారం (Maa Inti Bangaram). స‌మంత (Samantha) చాలా రోజుల త‌ర్వాత లీడ్ రోల్‌లో న‌టించ‌గా నందినీ రెడ్డి (B V Nandini Reddy) ద‌ర్శ‌క‌త్వం వ‌హించింది. ఓ చిన్న చిత్రంగా ప్రేక్ష‌కుల ఎదుట‌కు వ‌చ్చిన ఈ మూవీ విశేష ప్రేక్ష‌కాధ‌ర‌ణ ముక్యంగా మ‌హిళ‌ల‌ను థియేట‌ర్ల బాట ప‌ట్టించింది. అంతేగాక రూ.100 కోట్ల క‌లెక్ష‌న్లు రాబ‌ట్ట ఔరా అనిపించింది. అలంటి ఈ చిత్రం డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది.

అనాథ అయిన సువర్ణ డాక్టర్ అనిరుథ్‌ను పెళ్ళి చేసుకుంటుంది. పెద్దవాళ్ళ అనుమతి లేకుండా సువర్ణను వివాహం చేసుకున్న అనిరుథ్‌ తన చెల్లెలి పెళ్ళి కోసం మూడేళ్ళ తర్వాత భార్యతో కలిసి సొంతూరు వస్తాడు. పెళ్ళయ్యే లోపు అత్తారింటి నుంచి మంచి మార్కులు పొంది ఆ కుటుంబానికి చేరువ కావాలన్నది సువర్ణ కోరిక. ఆ సమయంలోనే సువర్ణ గతం తెలిసిన ఓ వ్యక్తి ఆమెను గుర్తుపట్టి జైలులో ఉన్న తీవ్రవాది కరుణకు సమాచారం చేరవేస్తాడు. తనది అనుకున్న సువర్ణ చేజారిపోతోందని క‌రుణ ఎంత‌టికైనా తెగించడానికి, ఆ కుటంబం మొత్తాన్ని అంత‌మొందించాల‌ని నిర్ణ‌యించుకుని జైలు నుంచి తప్పించుకుని వచ్చి ఏం చేశాడు? తన గతాన్ని దాచిపెట్టిన సువర్ణ ఎలా ఈ సమస్య నుంచి బయటకు వచ్చింది? రాజకీయ నేపథ్యం కలిగిన అనిరుథ్‌ తండ్రి రామయ్య రాజుకు క‌రుణ‌తో ఉన్న‌ వైరం ఏంటీ అనే ఆస‌క్తిక‌ర‌మూన క‌థ‌క‌థ‌నాల‌తో సినిమా సాగుతుంది.

ఎక్క‌డా సోదీ అనేది లేకుండా తొలి షార్ట్ నుంచే క‌థ‌లోకి వెళ్లి ఆపై ఉమ్మ‌డి కుటుంబం, మ‌నుషులు వారి వ్య‌వ‌హార శైలి అంతా చూసే వారిని ఇట్టే సినిమాను క‌నెక్ట్ అయ్యేలా చేస్తాయి. యాక్ష‌న్ సీన్లు సైతం కొత్త‌గా డిజైన్ చేసిన విధానం ఆక‌ట్టుకుంటుంది. రిలీజ్ అయి నెల కావ‌స్తున్నా స్టిల్ ఇప్ప‌టికీ ఈ మూవీ థియేట‌ర్ల నుంచి మంచి వ‌సూళ్ల‌నే రాబ‌డుతోంది. అయినా ఇప్పుడీ సినిమా జియో హాట్‌స్టార్ (Jio Hotstar) ఓటీటీలో తెలుగుతో పాటు ఇత‌ర భాష‌ల్లోనూ ఈ రోజు శుక్ర‌వారం (17.07.2026) నుంచి స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది. థియేట‌ర్ల‌లో మిస్స‌యిన వారు, సమంత అభిమమానులు ఎంచ‌క్కా ఇప్పుడే ఇంటి ప‌ట్టునే కుటంబం అంతా క‌లిసి ఎంజాయ్ చేయ‌వ‌చ్చు.

Updated Date - Jul 17 , 2026 | 08:21 AM