ప్రేమకథకు మరో అవకాశం దక్కుతుందా?.. రేణూదేశాయ్‌ ‘కాశీ మజిలీ’

ABN , Publish Date - Sep 12 , 2026 | 02:06 PM

నటి రేణూదేశాయ్‌ మరోసారి ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు.

నటి రేణూదేశాయ్‌ (Renu Desai) మరోసారి ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు. రవితేజ నటించిన ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రంలో చివరిసారిగా తెరపై కనిపించిన ఆమె.. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ‘కాశీ మజిలీ’తో (Kaasi Majili) మరోసారి నటిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. విభిన్నమైన కథలను ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతో ఈటీవీ విన్‌ తీసుకొస్తున్న ‘కథాసుధ’లో భాగంగా ఈ చిత్రం రూపొందింది. ‘కాశీ మజిలీ’కి యమున కిశోర్‌ దర్శకత్వం వహించారు. ‘కొన్ని ప్రేమకథలకు మరో అవకాశం దక్కాలి’ అనే ఆసక్తికరమైన థీమ్‌తో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ప్రేమ, అనుబంధాలు, జీవితంలో తీసుకునే నిర్ణయాలు.. వాటి ప్రభావం వంటి అంశాలను ఈ కథలో ప్రధానంగా చూపించనున్నట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది.

తాజాగా విడుదల చేసిన ట్రైలర్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ముఖ్యంగా రేణూదేశాయ్‌ పాత్ర చుట్టూ అల్లుకున్న భావోద్వేగాలు, ఆమె చెప్పే సంభాషణలు ఆకట్టుకునేలా ఉన్నాయి. జీవితంలో ఒకసారి ముగిసిపోయిందనుకున్న ప్రేమకు మరో అవకాశం దొరికితే ఏం జరుగుతుంది? గతాన్ని మర్చిపోయి కొత్తగా జీవితాన్ని ప్రారంభించగలమా? అనే ప్రశ్నలను ఈ సినిమా తెరపై చర్చించబోతున్నట్లు ట్రైలర్‌ సూచిస్తోంది. మూడేళ్ల విరామం తర్వాత రేణూదేశాయ్‌ ఎలాంటి పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు? ‘కొన్ని ప్రేమకథలకు మరో అవకాశం దక్కాలి’ అనే కాన్సెప్ట్‌ను దర్శకుడు యమున కిశోర్‌ ఎలా తెరపై ఆవిష్కరించారు? అనేది తెలియాలంటే సెప్టెంబరు 13 వరకు వేచి చూడాల్సిందే. ఈటీవీ విన్‌లో ‘కాశీ మజిలీ’ స్ట్రీమింగ్‌ కానుంది.

ట్రైలర్ చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Sep 12 , 2026 | 02:31 PM