ఓటీటీలో.. రీసెంట్ రొమాంటిక్ బ్లాక్‌బస్టర్! డోంట్‌మిస్
ABN , Publish Date - Aug 07 , 2026 | 11:14 AM
అథర్వ, ప్రీతి ముకుందన్, కయదు లోహర్ నటించిన రొమాంటిక్ డ్రామా ఇదయం మురళి డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
తమిళ సినీ ప్రియులకు మరో ఆసక్తికరమైన మూవీ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. గత నెల జూలై 10న థియేటర్లలో విడుదలైన రొమాంటిక్ డ్రామా ‘ఇదయం మురళి’ (Idhayam Murali) తాజాగా డిజిటల్ స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. అథర్వ (Atharvaa) ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో ప్రీతి ముకుందన్ (Preity Mukhundhan), కాయదు లోహర్ (Kayadu Lohar) కీలక పాత్రలు పోషించారు. మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil) ఎక్స్‌టెండెడ్ క్యామియోలో కనిపించడం ఈ సినిమాకు మరో ప్రత్యేక ఆకర్షణ.
కథ విషయానికి వస్తే.. ‘ఇదయం మురళి’ కథ హృదయ్ అనే యువకుడి చుట్టూ తిరుగుతుంది. మేనమామ నట్టి పెంపకంలో పెరిగిన హృదయ్ చిన్నప్పటి నుంచే సిగ్గు, బిడియం, మొహమాటం ఎక్కువ. దాంతో తన మనసులో ఉన్న విషయాన్ని ఎదుటివారితో పంచుకోడు. ఈ నేపథ్యంలో స్కూల్‌లో చదువుతున్న సమయంలోనే సమంత అనే అమ్మాయిని తొలిచూపులోనే చూసి హృదయ్ ప్రేమలో పడతాడు. కానీ తన మనసులోని మాట చెప్పడానికి అతడు వెనుకడుగు వేస్తాడు. దీంతో ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. కొన్నాళ్ల తర్వాత తన స్నేహితుడి ప్రియురాలి ఫ్రెండ్ అముదను చూసి హృదయ్ మరోసారి ప్రేమలో పడతాడు. అయితే తన ప్రేమను వ్యక్తపరచాలా? వద్దా? అనే ఆలోచనల్లో ఉండగానే పరిస్థితులు మారిపోతాయి. అముద కూడా అతడికి దూరమవుతుంది.
ఇలా తన జీవితంలోకి వచ్చిన రెండు ప్రేమలను హృదయ్ తన మొహమాటం, సంకోచం కారణంగా కోల్పోతాడు. మరోవైపు కుటుంబ పరిస్థితుల కారణంగా అదితితో అతడి పెళ్లి కుదురుతుంది. సరిగ్గా అదే సమయంలో హృదయ్‌కు తన గతం గుర్తుకొస్తుంది. అమెరికాలో నాసాలో పనిచేస్తున్న సమంతకు ఇప్పటికైనా తన మనసులోని మాట చెప్పాలని నిర్ణయించుకుంటాడు. దీంతో పెళ్లికి ముందు ఆమెను కలవడానికి అమెరికా వెళ్తాడు. అక్కడికి వెళ్లిన తర్వాత హృదయ్ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి? సమంతకు తన ప్రేమను చెప్పగలిగాడా? ఆమె ఎలా రెస్పాండ్ అయింది?. అదితితో కుదిరిన పెళ్లి చివరకు ఏమైంది? అనేది సినిమా కథ.
పాతికేళ్ల క్రితం దివంగత తమిళ స్టార్ మురళి నటించిన సూపర్ హిట్ ఇదయం చిత్రాన్ని ఆధారంగా తీసుకుని తెరకెక్కించిన ఈ మూవీలో కొడుకు ఆధర్వ నటించడం ఈ చిత్రం ప్రత్యేకత. ఫస్ట్ నుంచి చివరి వరకు అంతా ఫీల్ గుడ్‌గా సాగుతూ ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టకుండా మంచి వినోదాత్మకంగా సాగుతుంది. ఇప్పుడు ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీలో తమిళంతో పాటు తెలుగు ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్లలో మిస్సయిన వారు, మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అశించే వారు తప్పక ఈ మూవీని చూసేయవచ్చు. డోంట్ మిస్.