సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Rakasa: ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడ అంటే..

ABN, Publish Date - Apr 26 , 2026 | 04:44 PM

సంగీత్‌ శోభన్‌, నయన్‌ సారిక, గెటప్‌ శ్రీను, వెన్నెల కిశోర్  ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘రాకాస’  చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది 

సంగీత్‌ శోభన్‌, నయన్‌ సారిక, గెటప్‌ శ్రీను, వెన్నెల కిశోర్  ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘రాకాస’ (Rakasa). ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ రైటర్‌గా, బెంచ్ మార్క్ సిరీస్ కు దర్శకురాలిగా పని చేసిన మానస శర్మకు  తొలి ఫీచర్ సినిమా ఇది. నిహారిక కొణిదెల నిర్మించిన ఈ సినిమా ఇటీవల విడుదలై ప్రేక్షకాదరణ పొందింది. ఇప్పుడు ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. మే 1 నుంచి ‘నెట్‌ఫ్లిక్స్‌’ (Netflix)లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్నీ మేకర్స్ ప్రకటించారు. 

కథ:

రాకవనం అనే ఓ ఊరు. ఆ ఊళ్లో వందల ఏళ్ల చరిత్ర ఉన్న భయంకరమైన కోట. అందులో ఓ బ్రహ్మరాక్షసి. ఊరిలో ఉల్క పడిన ప్రతిసారీ మూతపడి ఉన్న కోటలో ఉన్న రాకాసికి బలిదానం ఇవ్వాలి. లేదంటే.. ఊరు వల్లకాడు అవుతుంది. వింతలు జరుగుతుంటాయి. ఆ కోటలోకి వెళ్లిన ఎవరూ బయటకు రాలేరు. ఆ రాకాసిని అంతం చేయడానికి తన సైనికులతో ఓ రాజు లోపలికి వెళ్లి బలైపోతాడు. అప్పటి నుంచి ఆ కోట జోలికి ఎవరూ వెళ్లరు. తోక చుక్క పడినప్పుడు మాత్రం ఆ ఊరి ఆచారం, సంకేతాల ప్రకారం ఓ మనిషిని బలిస్తారు. అలా ఓ సారి అమెరికా నుంచి రాకవనం వచ్చిన వీరబాబు (సంగీత్‌ శోభన్‌) ఆ కోట ప్రాంతంలోకి వెళ్లి ఇబ్బందుల్లో చిక్కుకుంటాడు. అప్పుడు తలెత్తిన సమస్యలకు అతనే కారణమంటూ బలిగా అతన్నే వెళ్ళమంటారు గ్రామస్తులు. పిరికివాడైన వీరు కోటలోకి వెళ్లి ఏం చేశాడు? అప్పటికే కోటలో ఉన్న సోము (వెన్నెలకిశోర్‌) ఎవరు? వీరును ప్రేమించిన సుబ్బలక్ష్మీ (నయన్ సారిక) అతని కోసం ఏం చేసింది? రాకాసి బారి నుంచి వీరు, సోము, సుబ్బు బయటపడ్డారా లేదా అన్నది మిగతా కథ.

Updated Date - Apr 26 , 2026 | 04:53 PM