సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Purushaha OTT: ఓటీటీలో దూసుకెళుతున్న.. ప‌వ‌న్ క‌ల్యాణ్ కొత్త సినిమా

ABN, Publish Date - Jul 25 , 2026 | 09:22 PM

థియేటర్లలో ప్రేక్షకుల ఆదరణతో విజయాన్ని సొంతం చేసుకున్న ‘పురుష: (Purushaha OTT)’ చిత్రం ఇప్పుడు ఓటీటీలోనూ అదే జోరు కొనసాగిస్తోంది.

Purushaha

థియేటర్లలో ప్రేక్షకుల ఆదరణతో విజయాన్ని సొంతం చేసుకున్న ‘పురుష: (Purusha OTT)’ చిత్రం ఇప్పుడు ఓటీటీలోనూ అదే జోరు కొనసాగిస్తోంది. బత్తుల పవన్ కళ్యాణ్ (Battula Pawan Kalyan) హీరోగా నటించిన ఈ చిత్రాన్ని కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బత్తుల కోటేశ్వరరావు నిర్మించగా, బత్తుల సరస్వతి సమర్పించారు. వీరు వులవల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సప్తగిరి, కసిరెడ్డి రాజ్ కుమార్, రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్ కీలక పాత్రల్లో కనిపించారు.

మే 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం వినోదంతో పాటు కుటుంబ భావోద్వేగాలకు పెద్దపీట వేయడంతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా మహిళలు, కుటుంబ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో బాక్సాఫీస్ వద్ద విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సినిమాలో హీరో బత్తుల పవన్ కళ్యాణ్ నటనతో పాటు సప్తగిరి, కసిరెడ్డి రాజ్ కుమార్ అందించిన కామెడీ ప్రేక్షకులను అలరించింది. రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్ తమ పాత్రల్లో సహజ నటనతో మెప్పించగా, ముగ్గురు హీరోయిన్లకు కూడా ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు లభించింది.

థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత ఈ చిత్రం ఇటీవల ఆహా, అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఓటీటీల‌లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. విడుదలైన కొద్ది రోజుల్లోనే రెండు ప్లాట్‌ఫామ్‌లలోనూ మంచి వ్యూయర్‌షిప్‌ను నమోదు చేస్తూ ట్రెండింగ్ జాబితాలో చోటు దక్కించుకుంది. కుటుంబ సభ్యులంతా కలిసి ఎలాంటి అసౌకర్యం లేకుండా చూసేలా రూపొందిన వినోదాత్మక కథ, హాస్య సన్నివేశాలు, భావోద్వేగాల మేళవింపు ఓటీటీ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటున్నాయి. థియేటర్లలో అందుకున్న విజయాన్ని డిజిటల్ వేదికలపై కూడా కొనసాగిస్తూ ‘పురుష:’ మరోసారి ప్రేక్షకుల మన్ననలు పొందుతోంది.

Updated Date - Jul 25 , 2026 | 09:30 PM