సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘పేట్రియాట్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ వివరాలివే!

ABN, Publish Date - May 22 , 2026 | 08:20 PM

దాదాపు 18 ఏళ్ల త‌ర్వాత‌ మలయాళ సినీ దిగ్గజాలు మ‌మ్ముట్టి, మోహ‌న్ లాల్ కలిసి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ చిత్రం ‘పేట్రియాట్’. ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.

Patriot OTT Release Details

దాదాపు 18 ఏళ్ల త‌ర్వాత‌ మలయాళ సినీ దిగ్గజాలు మ‌మ్ముట్టి (Mammootty), మోహ‌న్ లాల్ (Mohanlal) కలిసి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ చిత్రం ‘పేట్రియాట్’ (Patriot). మ‌హేష్ నారాయ‌ణ‌న్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో న‌య‌న‌తార‌, ఫ‌హాద్ ఫాజిల్‌, కున్‌చాకో బొబ‌న్ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. మే 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. మంచి సక్సెస్‌నే అందుకుంది. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు ఈ చిత్రం సిద్ధమైంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌కు సంబంధించిన వివరాలను, రైట్స్ సొంతం చేసుకున్న జీ5 (Zee5) సంస్థ ప్రకటించింది.


‘పేట్రియాట్’ మూవీ మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో జీ5 ఓటీటీ వేదికగా జూన్ 5 నుంచి స్ట్రీమింగ్ కానుందని, సదరు ఓటీటీ సంస్థ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. గూఢచర్యం, రాజకీయాలు, టెక్నాలజీ, భావోద్వేగాలు, నాట‌కీయ‌తల‌ను కలిపి రూపొందించిన ఈ సినిమాలో.. అధికారం ఆధారంగా నడిచే వ్యవస్థలో నియంత్రణలేని నిఘా ఎంత ప్రమాదకరంగా మారుతుందో చూపించారు. క‌థ‌లో ప్ర‌ధాన పాత్ర‌ధారి దేశ భద్రత కోసం ఒక అత్యాధునిక ప్రభుత్వ నిఘా వ్యవస్థను రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాడు. ఆ నిఘా వ్యవస్థను రూపొందించిన వ్యక్తే.. దానికి ఎదురెళతాడు. తను ఎందుకలా చేశాడు? అతను చేసింది దేశద్రోహమా? లేక, నిజమైన దేశభక్తికి అర్థమా? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.


ఈ మూవీ ఓటీటీ విడుదలను పురస్కరించుకుని దర్శకుడు మ‌హేష్ నారాయ‌ణ‌న్ మాట్లాడుతూ... ‘పేట్రియాట్’ మూవీ మనం ప్రస్తుత అనుభవిస్తున్న ప‌రిస్థితుల ఆధారంగా తెర‌కెక్కించిన‌ సినిమా. ప్రజలను రక్షించడానికి రూపొందించిన టెక్నాలజీనే చివ‌ర‌కు భయం, నియంత్రణకు ఆయుధంగా మారే పరిస్థితులను ఈ సినిమాలో చూపించాం. దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్ష‌కులంద‌రూ జీ5లో ఈ మూవీ చూసి ఎంజాయ్ చేస్తార‌ని కోరుతున్నానని అన్నారు. జూన్ 5న జీ5 ఓటీటీలోకి వస్తోన్న ఈ మూవీని చూసి అంతా ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నట్లుగా మమ్ముట్టి, మోహన్ లాల్ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

అసలు చరణ్ - ఎన్టీఆర్ మధ్య ఏం జరుగుతోంది?

Drishyam 3: దృశ్యం 3 మూవీ రివ్యూ

చిరుకి కాదు.. బాలయ్యకు విలన్‌గా మనోజ్!

Updated Date - May 22 , 2026 | 08:20 PM