పరిమళ అండ్ కో.. కామెడీ దృశ్యం

ABN , Publish Date - Jul 12 , 2026 | 05:03 PM

సినిమా ప్రపంచంలో బెస్ట్ థ్రిల్లర్ సినిమాల లిస్ట్ తీస్తే దృశ్యం మొదటి వరసలో ఉంటుంది అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. ఎన్ని  థ్రిల్లర్స్  వచ్చినా దీనిని మించింది లేదు. అందులో మోహన్ లాల్ కుటుంబం.. కామెడీ పంచితే ఎలా ఉంటుంది. పరిమిళ అండ్ కో (Parimala And Co) అలా ఉంది అని చెప్పొచ్చు. 

Parimala and Co

సినిమా ప్రపంచంలో బెస్ట్ థ్రిల్లర్ సినిమాల లిస్ట్ తీస్తే దృశ్యం మొదటి వరసలో ఉంటుంది అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. ఎన్ని  థ్రిల్లర్స్  వచ్చినా దీనిని మించింది లేదు. అందులో మోహన్ లాల్ కుటుంబం.. కామెడీ పంచితే ఎలా ఉంటుంది. పరిమిళ అండ్ కో (Parimala And Co) అలా ఉంది అని చెప్పొచ్చు. జయరామ్(Jayaram), ఊర్వశి (Urvashi)లాంటి సీనియర్ నటుల కలయికలో, డైరెక్టర్ పాండిరాజ్ తెరకెక్కించిన తాజా డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ పరిమళ అండ్ కో.  దృశ్యం తరహా ఫ్యామిలీ క్రైమ్ డ్రామాకు కాస్త కామెడీ టచ్ ఇస్తూ చేసిన ఈ ప్రయోగం  జూన్ 5 న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమా ఈ శుక్రవారం ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. జీ5 లో ఈ చిత్రం అన్ని భాషల్లో అందుబాటులో ఉంది. మరి పరిమళ అండ్ కో ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో   చూద్దాం.


పరిమళ (జయరామ్) ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబ యజమాని. భార్య స్వరాజ్యం (ఊర్వశి), ఇద్దరు కూతుళ్లు మధుమిత, పరాశక్తిలతో కలిసి జీవిస్తుంటాడు. నిత్యం డబ్బు ఇబ్బందులు, చిన్న చిన్న గొడవలతో సాగిపోయే వీరి లైఫ్ లోకి వర్గీస్ (శాండీ మాస్టర్) అనే లోకల్ రౌడీ ప్రవేశిస్తాడు. ఆ ఇద్దరు అమ్మాయిలను వేధిస్తూ, ఒకరిని పెళ్లి చేసుకుంటానని బ్లాక్‌మెయిల్ చేస్తుంటాడు. ఈ క్రమంలో ఒకరోజు వర్గీస్ అనుమానాస్పద స్థితిలో శవమై కనిపిస్తాడు. ఈ మర్డర్ కేసులో పరిమళ కుటుంబం ప్రధాన నిందితులుగా మారుతారు. కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి వింత అలవాట్లు ఉన్న పోలీస్ ఆఫీసర్  ఏడుకొండలు(మిస్కిన్ ) ఎంటర్ అవుతాడు. ఆ తర్వాత ఆ కుటుంబం ఎలాంటి తిప్పలు పడింది? అసలు వర్గీస్ ని చంపిందెవరు? ఇందులో చిట్టి శంకర్ (సంతోష్ శోభన్ ) పాత్ర ఏంటి..? అనేదే మిగతా కథ.


ఈ సినిమాకు అతిపెద్ద బలం జయరామ్, ఊర్వశిల నటన , వారి మధ్య కెమిస్ట్రీ అనే చెప్పాలి. ఎంతో అనుభవజ్ఞులైన ఈ ఇద్దరు నటులు మధ్యతరగతి దంపతులుగా అద్భుతంగా కనిపించారు. సినిమా మొదటి భాగం  ఆ ఫ్యామిలీ బాండింగ్, చిన్న చిన్న నవ్వులు, సహజమైన సీన్లతో కథలోకి మనల్ని ఈజీగా తీసుకెళ్తుంది. ఇక ఎప్పడైతే వర్గీస్ హత్యకు గురవుతాడో.. అప్పటి నుంచి ప్రేక్షకుల్లో ఉత్కంఠ మొదలవుతుంది. ఆ కుటుంబంలో ఎవరు వర్గీస్ ని చంపారు అనే అనుమానం అందరిలో ఉంటుంది.. వాటికి తగ్గ కారణాలను కూడా చూపించిన విధానం బావుంది. పోలీస్ ఆఫీసర్ గా మిస్కిన్  తన విలక్షణమైన శైలితో, డెడ్‌పాన్ కామెడీతో  బాగా ఆకట్టుకున్నాడు. బజ్జీలు, పానీపూరి తింటూ ఆయన చేసే ఇన్వెస్టిగేషన్ సీన్లు అక్కడక్కడా మంచి నవ్వులు పూయిస్తాయి. తెలుగు హీరో అయినా సంతోష్ శోభన్ ఇలాంటి ఒక పాత్ర చేసాడు అంటే కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. 


దృశ్యం తరహా ఫ్యామిలీ క్రైమ్ డ్రామాకు కాస్త కామెడీ టచ్ ఇస్తూ చేసిన ఈ ప్రయోగం ఆరంభంలో ఆసక్తికరంగానే అనిపిస్తుంది. మొదటి సగంలో ఉన్నంత వేగం, పట్టు రెండో సగంలో  లోపించాయి. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయ్యాక కథనం పూర్తిగా గాడి తప్పింది. కథను ఎటు తీసుకెళ్లాలో తెలియక అనవసరమైన సాగదీత సీన్లతో సినిమా రన్ టైమ్ పెంచేశారు. డార్క్ కామెడీగా మొదలైన సినిమా, ఆ తర్వాత రెగ్యులర్ రివెంజ్ డ్రామాగా మారిపోవడం నిరాశ పరుస్తుంది. కథలో వచ్చే ట్విస్టులు కూడా అంతగా థ్రిల్ ఇవ్వవు, పైగా చాలా చోట్ల లాజిక్ లేనట్టు అనిపిస్తుంది. ఎడిటింగ్ లోపాలు, అనవసరమైన కెమెరా కట్స్ కథా గమనానికి అడ్డుపడ్డాయి. యోగి బాబు కామెడీ ట్రాక్ కూడా పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. మొత్తంగా చూసుకుంటే పరిమళ అండ్ కో ఒక మంచి క్రైమ్-కామెడీ అవ్వాల్సిన సినిమా అయినప్పటికీ బలహీనమైన స్క్రీన్‌ప్లే వల్ల ఒక యావరేజ్ ఫిల్మ్ గా మిగిలిపోయింది. జయరామ్, ఊర్వశి, మిస్కిన్  ల కామెడీ నటన కోసం ఓసారి ఓటీటీలో క్యాజువల్ గా టైమ్ పాస్ కోసం చూడొచ్చు.

Updated Date - Jul 12 , 2026 | 05:28 PM