Ott: ఓటీటీలోకి ‘పాపం ప్రతాప్‌’ . ఎక్కడంటే

ABN , Publish Date - May 05 , 2026 | 02:41 PM

'మసూద' (Masooda), 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' (The Great Pre-Wedding Show) సినిమాలతో  చక్కని గుర్తింపు తెచ్చుకుంటున్నారు తిరువీర్. ఆయన నటించిన తాజా చిత్రం 'పాపం ప్రతాప్'. 

'మసూద' (Masooda), 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' (The Great Pre-Wedding Show) సినిమాలతో  చక్కని గుర్తింపు తెచ్చుకుంటున్నారు తిరువీర్. ఆయన నటించిన తాజా చిత్రం 'పాపం ప్రతాప్'.  ఎస్పీ దుర్గా నరేశ్‌ దర్శకుడు.  అజయ్‌ ఘోష్‌, రాశి, పాయల్‌ రాధాకృష్ణ కీలక పాత్రధారులు.   రాకేశ్ రెడ్డి, రుద్రదేవ్ నిర్మాతలు.   ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది.  ఈ నెల 7 నుంచి ఈటీవీ విన్‌ (ETV Win) వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని ఓ పోస్టర్   విడుదల చేసి వెల్లడించారు మేకర్స్.   

కథ: 

గ్రామీణ నేపథ్యంలో సాగే సైకలాజికల్ థ్రిల్లర్ లవ్ స్టోరీ ఇది. ప్రతాప్ (తిరువీర్) చిన్నప్పటి నుండి తాను ప్రేమిస్తున్న బుజ్జమ్మ (పాయల్ రాధాకృష్ణ Payal Radhakrishna)ను పెద్దలను ఒప్పించి మరీ పెళ్ళి చేసుకుంటాడు. ఒక్కగానొక్క కొడుకు మాట కాదనలేక ప్రతాప్ తల్లిదండ్రులు ఈ పెళ్ళికి అంగీకరిస్తారు. అయితే వివాహానంతరం మూడు రాత్రులు గడిచీ గడవగానే ప్రతాప్‌తో తాను కాపురం చేయలేనంటూ బుజ్జమ్మ పంచాయితీకి ఎక్కుతుంది. అతనికి ఉన్న సమస్యను తాను అందరి ముందు చెప్పలేనని, తన సమస్యను తానే పరిష్కరించుకుని వస్తే తప్ప కాపురానికి రానని కరాఖండీగా చెప్పేస్తుంది. ప్రేమించి పెళ్ళి చేసుకున్న వీరిద్దరూ ఇలా విడిపోవడంతో ప్రతాప్ గురించి ఊరిలో జనం నానారకాలుగా అనుకుంటారు. తన సమస్య గురించి తెలుసుకుని, దాన్ని అధిగమించానని నమ్మబలికి తిరిగి బుజ్జమ్మను కాపురానికి ప్రతాప్ తీసుకొస్తాడు. కానీ అదీ మూడు నాళ్ళ ముచ్చటే అవుతుంది. అతనితో జీవితాన్ని సాగించలేని బుజ్జమ్మ తిరిగి పుట్టింటికి వెళ్ళిపోతుంది. అసలు ప్రతాప్కు ఉన్న సమస్య ఏమిటీ? దానికి మూలం ఏమిటీ? ఈ విషయం తెలిసిన తర్వాత అయినా ప్రతాప్ ఆ సమస్య నుండి బయట పడ్డాడా? లేదా? ఈ క్రమంలో అతను ఎలాంటి అవమానాలు, అపనిందలు ఎదుర్కొన్నాడు? అనేది మిగతా కథ

Updated Date - May 05 , 2026 | 03:54 PM