కుర్రాళ్లు.. తిరిగొచ్చారు! ‘హ్యారీ పోటర్’.. ట్రైల‌ర్ అదిరింది

ABN , Publish Date - Sep 03 , 2026 | 11:30 AM

గ‌డిచిన రెండు మూడు ద‌శాబ్దాలుగా ప్రేక్ష‌కుల‌ను విశేషంగా అల‌రించిన హాలీవుడ్ చిత్ర రాజం హ్యారీ పోట‌ర్ ఇప్పుడు మ‌రోసారి వినూత్నంగా, స‌రికొత్త హంగుల‌తో ముస్తాబ‌యింది.

Harry Potter

గ‌డిచిన రెండు మూడు ద‌శాబ్దాలుగా ప్రేక్ష‌కుల‌ను విశేషంగా అల‌రించిన హాలీవుడ్ చిత్ర రాజం హ్యారీ పోట‌ర్ ఇప్పుడు మ‌రోసారి వినూత్నంగా, స‌రికొత్త హంగుల‌తో ముస్తాబ‌యింది. కొంత‌కాలంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ‘హ్యారీ పోటర్’ (Harry Potter and the Philosopher’s Stone) అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొత్త వెబ్ సిరీస్ నుంచి అఫీషియల్ ట్రైలర్ బుధ‌వారం విడుదలైంది. హాగ్వార్ట్స్ మాయాజాలాన్ని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న ఈ సిరీస్ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్, భారీ నిర్మాణ విలువలు, అద్భుతమైన సెట్స్‌తో రూపొందించిన ఈ ట్రైలర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. జే.కే. రౌలింగ్ సృష్టించిన మాయా ప్రపంచాన్ని మరింత విస్తృతంగా, కొత్త తరానికి అనుగుణంగా ఈ సిరీస్‌లో ఆవిష్కరించనున్నట్లు ట్రైలర్ స్పష్టం అవుతోంది. ఇదిలాఉంటే ఈ చిత్రంలో హ్యారీ పోటర్‌గా డొమినిక్ మెక్‌లాఫ్లిన్, హెర్మియోన్ గ్రేంజర్‌గా అరబెల్లా స్టాంటన్ మరియు రాన్ వీజ్లీగా అలస్టైర్ స్టౌట్ నటించారు.

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఫాంటసీ సిరీస్ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ప్రముఖ స్ట్రీమింగ్ వేదిక HBOలో ప్రసారం కానుంది. భారత‌దేశంలో జీయో హాట్ స్టార్ ఓటీటీ (Jio Hotstar) లో అందుబాటులోకి రానుంది. ట్రైలర్ విడుదలైన కొద్ది గంటల్లోనే భారీ వ్యూస్ సాధిస్తూ ‘హ్యారీ పోటర్’ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.

Updated Date - Sep 03 , 2026 | 11:30 AM