సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

OTT : నెట్ ఫ్లిక్స్ లో స్టార్స్ మూవీస్

ABN, Publish Date - Jan 17 , 2026 | 02:29 PM

నెట్ ఫ్లిక్స్ సంస్థ 2026లో తాను స్ట్రీమింగ్ చేయబోతున్న సినిమాల వివరాలను ప్రకటించింది. రామ్ చరణ్ 'పెద్ది', పవన్ కళ్యాణ్‌ 'ఉస్తాద్ భగత్ సింగ్', నాని 'ది పారడైజ్', వెంకటేశ్ 'ఆనంద నిలయం', దుల్కర్ 'ఆకాశంలో ఒక తార' తదితర చిత్రాలు ఈ జాబితాలో ఉన్నాయి.

Netflix line order

గడిచిన యేడాది నెట్ ఫ్లిక్స్ క్రేజీ మూవీస్ ను స్ట్రీమింగ్ చేసింది. అందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2'తో పాటు నేచురల్ స్టార్ నాని 'హిట్ 3', పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ 'ఓజీ' ఉన్నాయి. ఇవే కాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకున్న 'కోర్ట్', 'ది గర్ల్ ఫ్రెండ్' చిత్రాలూ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యి వ్యూవర్స్ ను ఆకట్టుకున్నాయి.

ఇదిలా ఉంటే తాజాగా నెట్ ఫ్లిక్స్ సంస్థ 2026లో స్ట్రీమింగ్ హక్కులను తీసుకున్న వివరాలను విశేషంగా తెలియచేసింది. అందులో ఇప్పటికే విడుదలైన 'ఛాంపియన్' చిత్రం ఉండగా, ఈ యేడాది జనం ముందుకు రాబోతున్న పవన్ కళ్యాణ్‌ 'ఉస్తాద్ భగత్ సింగ్', నాని 'ది ప్యారడైజ్', దుల్కర్ సల్మాన్ 'ఆకాశంలో ఒక తార' చిత్రాలు ఉన్నాయి. ఇక మాస్ కా దాస్ విశ్వక్ సేన్, అనుదీప్ కాంబో మూవీ 'ఫంకీ' స్ట్రీమింగ్ హక్కుల్ని కూడా నెట్ ఫ్లిక్స్ సంస్థ తీసుకుంది. దీనితో పాటే విజయ్ దేవరకొండ, రశ్మిక మందణ్ణ జంటగా రాహుల్ సాంకృత్యన్ తెరకెక్కిస్తున్న మూవీ, సంగీత్ శోభన్ 'రాకాస' మూవీ రైట్స్ ను పొందింది. ఇక వెంకటేశ్, త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న తొలి చిత్రం 'ఆదర్శకుటుంబం', రామ్ చరణ్ క్రేజీ ప్రాజెక్ట్ 'పెద్ది', శర్వానంద్ 'బైకర్' చిత్రాలు నెట్ ఫ్లిక్స్ లో రాబోతున్నాయి. ఫహద్ ఫాజిల్ మూవీ 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్', శ్రీ వైష్ణవ్, శశాంక్ పాటిల్ '418 చైత్ర ఆర్చర్', హర్ష్‌ రోషన్, అన్నా బెన్ మూవీ కూడా ఇందులోనే స్ట్రీమింగ్ కానుంది.

ఈ విషయాలను నెట్‌ఫ్లిక్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ (కంటెంట్) మోనికా షెర్గిల్ తెలియచేస్తూ, '2026లో తెలుగులో మెయిన్‌స్ట్రీమ్ ఎంటర్టైనర్ల నుంచి డెప్త్, క్యారెక్టర్ బేస్డ్ చిత్రాల వరకూ గొప్ప కథలు రాబోతున్నాయి. పరిశ్రమ, ప్రేక్షకుల అభిరుచులు ఎలా మారుతున్నాయో దానికి అనుగుణంగా ముందుకు సాగుతూ, క్రియేటివ్ బౌండరీలు దాటే దర్శకులను మేం ప్రోత్సహిస్తున్నాం. ఈ కథలను విస్తృత స్థాయిలో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే నెట్ ఫ్లిక్స్ లక్ష్యం' అని చెప్పారు.

Updated Date - Jan 17 , 2026 | 02:56 PM