సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

నయనతార ‘హాయ్’ ఓటీటీకి వచ్చేసింది.. మరి ‘టాక్సిక్’ స్ట్రీమింగ్ ఎప్పుడు?

ABN, Publish Date - Sep 25 , 2026 | 06:58 PM

లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన తాజా రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘హాయ్’ ప్రముఖ ఓటీటీ వేదిక ‘జీ5’ లోకి అధికారికంగా అడుగుపెట్టింది. మరి ఆమె కీలక పాత్రలో నటించిన ‘టాక్సిక్’ ఎప్పుడంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Hi and Toxic Posters

లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన తాజా రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘హాయ్’ (Hi) ప్రముఖ ఓటీటీ వేదిక ‘జీ5’ (Zee5)లోకి అధికారికంగా అడుగుపెట్టింది. నయనతార (Nayanthara), టాలెంటెడ్ నటుడు కవిన్ (Kavin) ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి విష్ణు ఎడవన్ దర్శకత్వం వహించారు. నేటితరం ప్రేమ సంబంధాలు, భావోద్వేగాలను సరికొత్తగా ఆవిష్కరించిన ఈ ఫీల్ గుడ్ మూవీ సెప్టెంబర్ 25 నుంచి తమిళ జీ5లో స్ట్రీమింగ్ అవుతూ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. రాధికా శరత్‌కుమార్, ప్రభులతో పాటు దివంగత నటుడు కె. భాగ్యరాజ్ చివరి చిత్రాల్లో ఒకటిగా నిలిచిన ఈ సినిమా.. ఓటీటీ వీక్షకులకు మంచి అనుభూతిని పంచుతోంది.


ఇదిలా ఉంటే, నయనతార కీలక పాత్రలో నటించిన మరో మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా చిత్రం ‘టాక్సిక్’ (Toxic) ఓటీటీ విడుదలపై సినీ ప్రియుల్లో ఉత్కంఠ నెలకొంది. రాకింగ్ స్టార్ యశ్ (Rocking Star Yash) కథానాయకుడిగా గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ ప్రాజెక్ట్‌లో నయనతారతో పాటు కియారా అద్వానీ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ క్రేజీ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను కూడా భారీ ధరకు జీ5 సంస్థే దక్కించుకుంది. తొలుత ఈ సినిమా కూడా సెప్టెంబర్ 25నే ఓటీటీలోకి వస్తుందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోవడం గమనార్హం.


ఈ నేపథ్యంలో ‘టాక్సిక్’ ఓటీటీ రిలీజ్‌పై రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. భారీ హైప్ ఉన్న చిత్రం కావడంతో, రాబోయే దసరా పండుగ కానుకగా ఆడియన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చేందుకే జీ5 యాజమాన్యం వ్యూహాత్మకంగా స్ట్రీమింగ్ తేదీని వాయిదా వేసి ఉండవచ్చని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవైపు ‘హాయ్’తో నయనతార సైలెంట్‌గా ఓటీటీ ఆడియన్స్‌ను పలకరించగా.. మరోవైపు యశ్-నయన్ కాంబోలో రానున్న ‘టాక్సిక్’ విషయంలో జీ5 ఎలాంటి సర్‌ప్రైజ్ ప్లాన్ చేసిందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి:

‘లవ్ అండ్ వార్’.. రెట్రో లుక్‌లో సెగలు రేపుతోన్న ఆలియా

ఎమోషనల్ లవ్ స్టోరీ ‘జాన్’ ఫస్ట్ లుక్ విడుదల

జర్నలిస్ట్ బాడీ షేమింగ్‌పై సంపూ క్లారిఫికేషన్.. ఏమన్నారంటే

Updated Date - Sep 25 , 2026 | 06:58 PM