సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

రాజుగారు.. ఓటీటీకి వ‌చ్చేశారు

ABN, Publish Date - Feb 11 , 2026 | 07:42 AM

నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంట‌గా మారి ద‌ర్శ‌క‌త్వంలో సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన చిత్రం అనగనగా ఒక రాజు.

Anaganaga Oka Raju

నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty), మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) జంట‌గా మారి ద‌ర్శ‌క‌త్వంలో సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన చిత్రం అనగనగా ఒక రాజు (Anaganaga Oka Raju). ఎప్పుడో రెండేండ్ల క్రితం ప్రారంభ‌మైన‌ ఈ సినిమా అనేక అవాంత‌రాల‌ను దాటుకుని ఈ సంక్రాంతికి భారీ సినిమాల న‌డుమ ప్రేక్ష‌కుల ఎదుట‌కు వ‌చ్చింది. అంతేగాక రూ.100 కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్లు రాబ‌ట్టి మంచి విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది. ఇప్పుడు ఈ చిత్రం డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది.

క‌థ విష‌యానికి వ‌స్తే.. గౌరవపురం జమీందారు గోపరాజు మనవడు రాజు (నవీన్ పొలిశెట్టి). ఆయ‌న తాత‌లు విందులు, ఆడంబ‌రాల‌కు, దానాల‌కు పోయి అస్తుల‌న్నీ పొగొట్టేస్తారు. రాజు స‌మ‌యానికి తాత పేరు చెప్పుకుంటూ గొప్ప‌లు పోవ‌డం త‌ప్పా చేయ‌డానికి ఏమీ ఉండ‌దు. అయినా అలానే.. గొప్ప‌ల‌తో కాలం వెళ్ల‌దీస్తూ ఉంటాడు. అయితే.. ఓరోజు త‌న‌ బంధువుల‌ ఇంట్లో పెళ్లికి వెళ్లిన‌ప్పుడు జ‌రిగిన అవ‌మానంతో అటు, ఇటు ఏడు త‌రాలు గుర్తుంచుకునేలా పెళ్లి చేసుకుంటాన‌ని అంద‌రిముందు స‌వాల్ చేస్తాడు. ఈ నేప‌థ్యంలోనే.. భూప‌తి రాజు కూతురు చారుల‌త‌ను లైన్‌లో పెట్టి పెళ్లి చేసుకుంటాడు.

కానీ అస‌లు స‌మ‌స్య అప్పుడే మొద‌ల‌వుతుంది. చారుల‌త ఇచ్చిన ట్విస్టుతో షాక్‌లోకి వెళ్లిపోతాడు. ఆపై తేరుకున్న రాజు ప్రెసిడెంట్ ఎన్నిక‌ల్లో నిల‌బ‌డ‌డంతో క‌థ మ‌లుపు తిరుగుతుంది. ఈ నేప‌థ్యంలో రాజు చేసిన స‌వాల్ ఏమైంది, ప్రెసిడెంట్ ఎన్నిక‌ల్లో గెలిచాడా లేదా, అత‌నిని ఊరి ప్ర‌జ‌లు ఎందుకు దూరం పెట్టారనే క‌థ‌క‌థ‌నాల‌తో సినిమా సాగుతూ ఉంటుంది. అయితే ఈ క్ర‌మంలో ఎక్క‌డా బోర్ కొట్ట‌కుండా స్క్రీన్ ప్లే, కామెడీ సినిమా అసాంతం ఆక‌ట్టుకుంటుంది. ఇప్పుడీ చిత్రం నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీలో తెలుగులో పాటు ఇత‌ర భాష‌ల్లోనూ స్ట్రీమింగ్ అవుతుంది. థియేట‌ర్‌లో మిస్స‌యిన వారు, న‌వీన్ ఫ్యాన్స్ త‌ప్ప‌క చూడాల్సిన సినిమా ఇది. సినిమాలో ఎక్క‌డా అస‌భ్య‌త‌, అశ్లీల‌త లేదు ఫ్యామిలీ అంతా క‌లిసి చూసేయ‌వ‌చ్చు.

Updated Date - Feb 11 , 2026 | 08:49 AM