మన శంకర వర ప్రసాద్ గారు కొత్త రికార్డ్
ABN, Publish Date - Feb 13 , 2026 | 07:15 PM
చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన 'మన శంకర వర ప్రసాద్ గారు' ఓటీటీలోనూ తన సత్తాను చాటుతోంది. జీ5లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాకు మొదటి 24 గంటల్లో రికార్డ్ స్థాయిలో వ్యూస్ దక్కాయి.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), అనిల్ రావిపూడి (Anil Ravipudi) సంక్రాంతి బ్లాక్ బస్టర్ మూవీ 'మన శంకర వర ప్రసాద్ గారు' (Mana Shankara Vara Prasad Garu) డిజిటల్ వరల్డ్‌లో మరో రికార్డును బద్దలు కొట్టింది. సంక్రాంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లతో బిగ్గెస్ట్ రీజినల్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోనూ అదరగొడుతోంది. జీ5లో ప్రీమియర్ తెలుగు సినిమా ఇంతకు ముందు ఎన్నడూ చూడని చారిత్రాత్మక విజయాన్ని ఇది సాధించింది. డిజిటల్ రిలీజ్ అయిన కేవలం 24 గంటల్లోనే, 'మన శంకర వర ప్రసాద్ గారు' 200 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ మినిట్స్ నమోదు చేసింది. ఒక తెలుగు చిత్రానికి ఇప్పటివరకు లభించిన బిగ్గెస్ట్ ఓపెనింగ్‌గా ఇదే కావడం విశేషం.
బాక్సాఫీస్ బరిలో ఘన విజయం సాధించిన సినిమాలు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో అరుదుగా మాత్రమే బిగ్ నెంబర్స్ సాధిస్తాయి. ఇప్పుడు 'మన శంకర వరప్రసాద్ గారు' అరుదైన రికార్డ్‌ని సొంతం చేసుకోవడం విశేషం. ఈ సెన్సేషనల్ రెస్పాన్స్‌కి మెగాస్టార్ చిరంజీవి ఆకట్టుకునే స్క్రీన్ ప్రెజెన్స్, అద్భుతమైన కామిక్ టైమింగ్ ప్రధాన పాత్ర పోషించాయని, ఆయన కరిజ్మా ప్రేక్షకులను మరోసారి మెస్మరైజ్ చేసిందని, అనిల్ రావిపూడి కలర్‌ఫుల్ కామెడీ దానికి జత కలిసిందని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటించారు.